Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
ఒకే రాశిలో నాలుగు గ్రహాల స్థాన చలనం.. ఈ రాశుల వారికి వందేళ్ల అదృష్టం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు అనేది రాశి ఫలాలకు కీలకం. గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడం వల్ల కొన్ని యోగాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అయితే మార్చి నెలలో నాలుగు గ్రహాలు తమ రాశులు మార్చబోతున్నాయి. ముఖ్యంగా, శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛస్థితిలో ఉన్నప్పటికీ, మార్చి నెలంతా వక్రంగా సంచరించబోతున్నాడు. అటు, బుధ గ్రహం కూడా మీన రాశిలో అడుగుపెట్టనున్నారు. మార్చి 14న, రవి మీన రాశిలోకి వెళ్లనున్నారు. అలాగే మార్చి చివరలో శని కూడా ఈ రాశిలో ప్రవేశిస్తాడు. ఈ నాలుగు గ్రహాలు ఒకేసారిలో చేరడం వలన కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వృషభం: శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు నాలుగు గ్రహాలు ఆ రాశిలో సంచరించడం వలన వృషభ రాశి వారికి లాభ స్థానం బలపడుతుంది. దీంతో ఆదాయ వనరులు వృద్ధి చెందనున్నాయి. అలాగే ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదల, వృత్తి, వ్యాపారాలలో కొత్త అవకాశాలు వంటి అవకాశాలు రాబోతున్నాయి. దీంతో పాటు షేర్ల ద్వారా ధన లాభాలు కలుగుతాయి. తద్వారా ఆర్థికంగా మెరుగైన మార్పులు రాబోతున్నాయి. కుటుంబ జీవితం కూడా బాగుండబోతుంది.
మిథునం: మీనరాశిలో నాలుగు గ్రహాల సంచారం కారణంగా ఈ రాశిలో దశమ స్థానంలో గ్రహాల బలం పెరుగుతుంది. దాంతో కెరీర్‌లో పురోగతి లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక లాభాలు, అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగుల డిమాండ్ పెరిగి ఆఫర్లు అందుతాయి.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో గ్రహాల బలం పెరుగడం వలన ఆర్థికంగా మంచి మార్పులు వస్తాయి. ఆకస్మిక ధన లాభం, షేర్ల ద్వారా అపార లాభాలు, విదేశీ సంబంధాలు, విదేశీ సంపాదన లభించవచ్చు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందే ఛాన్సుంటుంది. పెళ్లి సంబంధాల పరంగా విదేశీ సంబంధాలు కూడా ఏర్పడతాయి.
కన్య: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గ్రహాల సంచారం వల్ల, జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో ధన ప్రవాహం ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధాలు ఏర్పడవచ్చు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు దక్కుతాయి.
ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో గ్రహాల కలయిక కారణంగా కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వైవాహిక, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో రాజయోగాలు, ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. అలాగే సొంత ఇంటి కొనుగోలు కూడా సాధ్యమవుతుంది.
మకరం: ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రాజయోగ గ్రహాల సంయోగం వల్ల ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. బంధు, మిత్రులు, అధికారులు, సహోద్యోగుల సహాయం ద్వారా పురోగతి ఉంటుంది. ప్రయాణాల ద్వారా లాభాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకోని అభివృద్ధి కలుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
