Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Karthika Pournami: ఆర్థిక కష్టాలు పోవాలంటే.. ఏ రాశి వాళ్లు ఏం చేయాలో చూడండి
హిందూ మతంలో కార్తీక మాసం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసానికి కార్తికేయుడు అధిపతి కాబట్టి దీన్ని కార్తీక మాసం అంటారు. కార్తీక మాసంలో ప్రతీ రోజు ప్రముఖమైనదే. ఈ నెలలో చేసే పూజలు,వ్రతాలకు గొప్ప ఫలితం లభిస్తుందని చెబుతారు. అయితే కార్తీక మాసంలో విశిష్టమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ నెలలోని కార్తీక పూర్ణిమ రోజున విష్ణువు నాలుగు నెలల తర్వాత యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు.
ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ నవంబర్ 15న వచ్చింది. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ రాశి ప్రకారం కొన్ని పనులు చేస్తే జాతకంలో ఉన్న దోషాల నుండి విముక్తి పొందడమే కాకుండా ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. అయితే ఏయే రాశుల వారు ఇవాళ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

మేషరాశి
ఈ రాశుల వాళ్లు ఇవాళ ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఆంజనేయస్వామి ఆలయంలో కొబ్బరికాయ సమర్పించాలి. ఇది మీకు ఆర్థిక లాభాల అవకాశాలను ఇస్తుంది. మీ జీవితంలో శ్రేయస్సును తెస్తుంది.
వృషభం
ఈ రాశుల వాళ్లు ఈ రోజు లక్ష్మీ దేవిని పూజించి, తామరపూలను సమర్పించాలి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది.
మిధున రాశి
ఈ రాశి వారు కార్తీక పూర్ణిమ నాడు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఫుడ్ ని కూడా దానం చేయాలి. దీంతో మీకు ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు.
కర్కాటక రాశి
కార్తీక పూర్ణిమ నాడు ఈ రాశి వాళ్లు శివునికి పాలు, తేనెతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి సుఖశాంతులు,ఐశ్వర్యం కలుగుతాయి.
సింహ రాశి
ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు కాబట్టి మీరు ఈ రోజున సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీటిని సమర్పించాలి. అలాగే బెల్లం దానం చేయండి, ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.
కన్య రాశి
కార్తీక పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి తెల్లటి పుష్పాలను సమర్పించడం చాలా శుభప్రదం. దీంతో పాటు మీరు శ్రీ లక్ష్మీ అష్టకం పఠించాలి.
తుల రాశి
కార్తీక పూర్ణిమ రోజున తుల రాశి వాళ్లు దీపదానం చేయాలి. ఇలా చేయడం ద్వారా వ్యాపారంలో లాభాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
వృశ్చిక రాశి
కార్తీక పూర్ణిమ నాడు శివాలయానికి వెళ్లి శివలింగంపై బేల్పత్రాన్ని సమర్పించాలి. దీంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి.
ధనుస్సు రాశి
కార్తీక పూర్ణిమ నాడు ఆవుకి బెల్లం, తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీకు చేసే పనిలో విజయం లభిస్తుంది. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది.
మకర రాశి
మీరు ఈ రోజున శనిదేవుని ఆలయానికి వెళ్లి నల్ల నువ్వులను సమర్పించాలి. అంతే కాకుండా హనుమాన్ చాలీసా కూడా చదవాలి. దీనివల్ల ఆర్థికంగా కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయి.
కుంభ రాశి
ఈ రాశికి అధిపతి శని దేవుడు. ఈ రోజున మీరు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇది మీ జీవితంలో సానుకూలతను తెస్తుంది.
మీన రాశి
కార్తీక పూర్ణిమ రోజున ఈ రాశి వారు విష్ణువుకు పసుపు పుష్పాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో శ్రేయస్సు, మీ ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications