Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Ray Kurzweil: 2035 నాటికి వీరికి మరణం ఉండదు.. సైన్స్ జోతిష్యుడు రే కుర్వెల్ సంచలన ప్రకటన
ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకూ పెరిగిపోతుంది. ప్రతి రోజూ ఎదో ఒక ఇన్వెన్షన్ జరుగుతోంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు మానవుడి జీవన పరిణామాన్ని ఎలా పెంచాలి? జీవించే కాలాన్ని ఎలా పెంచాలి? అని పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అలాగే మానవులు చేసే పనులకు సులభతరం ఎలా చేయాలి? దానికి ఎలాంటి పరికరాలు, టెక్నాలజీ తీసుకురావాలి అని నిత్య పరిశోధన జరుపుతున్నారు.
అందులో భాగంగానే 2035 నాటికి ఓ సరికొత్త రోబోట్స్ వస్తాయట. ఇవి మనిషిని మరణం నుంచి బయట పడేస్తాయట. ఈ మేరకు పరిశోధనలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇవి మార్కెట్‌లో అందుబాటులో వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని గురించి ప్రముఖ న్యూరో సర్జన్ రంగనాథన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నానో రోబోట్స్
మనిషి జీవన పరిణామాలను, జీవించే కాలాన్ని పెంచడానికి నిత్య పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రే కుర్వెల్ అనే శాస్త్రవేత్త మనిషి జీవన పరిణామాన్ని పెంపొందించడానికి రోబోలను తయారు చేస్తున్నారట. ఇవి అత్యంత చిన్నవిగా ఉంటాయని, రక్తం ద్వారా శరీరంలో ప్రవేశిస్తాయని రంగనాథన్ వెల్లడించారు. ఈ రోబోలు 2035 నాటికి మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేస్తాయని వెల్లడించారు.
ఎలా పని చేస్తాయి?
ఈ నానో రోబోలు చాలా ప్రత్యేకమైనవని రంగనాథన్ వెల్లడించారు. వీటిని రక్తం ద్వారా శరీరంలోకి పంపిస్తారట. ఆ రోబోకు ప్రత్యేకమైన కోడ్ విధానంలో శరీరంలో ఎలాంటి భాగంలో ఎలాంటి రోగాన్ని నివారించాలి అనేది స్పష్టంగా చెబుతారట. దాని ద్వారా శరీరంలోని రోగాన్ని ఈ రోబో నాశనం చేసేసి బయటికి వచ్చేస్తుందట.
ఉదాహరణకు శరీరంలో క్యాన్సర్ ఉండదనుకోండి.. ఆ భాగంలో ఉన్న క్యాన్సర్ కణాలను తొలగించాలని ఈ రోబోకు కమాండ్ ఇచ్చి పంపిస్తారు. ఆ రోబో ఆ కణాలను తొలగించి, వాటిని చంపేచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అంత సులభంగా ఈ రోబో పనితనం ఉంటుందట.
శరీరానికి హాని ఉండదు
సాధారణంగా క్యాన్సర్‌కు లేదా ఇతర ఏదైనా వ్యాధులకు చికిత్స చేసేటప్పుడు శరీరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా డ్యామేజ్ ఏర్పడుతుంటుంది. అయితే ఈ రోబోల వల్ల ఆ సమస్యలు ఉండవు. ఇవి చాలా చిన్నగా ఉండడంతో పాటు కేవలం సమస్య ఉన్న ప్రాంతాన్ని మాత్రమే ఇది ప్రభావితం చేస్తుంది. మిగిలిన ప్రాంతాలకు ఇది ఎలాంటి హాని చేయదు. దీని వల్ల రోగం తొందరగా నయం అవడంతో పాటు, హాని కూడా చాలా తక్కువగా ఉంటుంది.
అయితే అసలు మనిషికి మరణం ఉండదని కాదు, వయసు రీత్యా వచ్చే మరణాలు ఉండడని ఆయన పేర్కొన్నారు. మనిషికి మరణానికి గురి చేసే కొన్ని కణాలను ఈ రోబో ద్వారా తీసేస్తే ఇక మరణం ఉండదని పేర్కొన్నారు. కానీ కొన్ని వ్యాధుల బారిన పడిన వారిని రక్షించడం మాత్రం కష్టమని పేర్కొన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే కచ్చితంగా మనిషి జీవన పరిమాణం పెరగడంతో పాటు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుందట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications