Latest Updates
-
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.!
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.!
మరో రెండు రోజుల్లో గణేశ్ నవరాత్రులు ముగియనున్నాయి. వినాయక చవితి మొదలు భక్తుల కోలాహలం నడుమ, నైవేద్యాలు, భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ఘనంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి నాడు భావోద్వేగంతో నిమజ్జనం ద్వారా గంగమ్మ ఒడికి చేరనున్నాడు బొజ్జ గణపయ్య. కాగా, ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇన్ని రోజుల పాటు గణపతి సేవలో ఉన్న భక్తులు నిమజ్జనం తర్వాత కొంతకాలం పాటు అదే ఉత్సాహం, ట్రాన్స్‌లో ఉంటారు. అంతేకాకుండా కొందరికి లంబోదరుడి కలలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. మరి నిమజ్జనం తర్వాత గణపయ్య మీ కలలోకి వస్తే దానర్థం ఏంటి.. దీనిపై స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది. నిపుణుల సలహాలు చూద్దాం..

కలలో గణనాథుడు ఇలా కనిపిస్తే
స్వప్న శాస్త్రం ప్రకారం గణేశుడు కలలోకి వస్తే చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని ప్రతి పూజలో ముందుగా పూజిస్తాం. అందుకే ఆయన కలలో కనిపిస్తే ఆటంకాలు తొలగిపోతాయి అనేదానికి సంకేతం. మీరు ఏదైనా శుభవార్త కూడా వినొచ్చు. కొత్త ప్రారంభాలు జరిగే అవకాశం ఉంది.

పూజిస్తున్నట్లుగా స్వప్నం
మీ కలలో మీరు గణనాథుడిని పూజిస్తున్నట్లుగా ఉంటే అది ఎంతో శుభసూచకం. ఇప్పటివరకూ ఆగిపోయిన పనులు పూర్తవుతాయనేదానికి ఇది సంకేతం. మీరు మున్ముందు మంచి అవకాశాలు, మీకు జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయనేదానికి చిహ్నంగా భావించాలి.

కలలో గణపయ్య వాహనం
చిట్టి ఎలుక బొజ్జ గణపయ్యకి వాహనంగా ఉంటుంది. చంచలమైన మనస్తత్వం, ఇతరులను ఇబ్బంది ఉంటే గుణం ఉన్న ఎలుకను వాహనంగా మార్చి దానికి నిలకడ స్థానం ఏర్పరిచిన ఏకదంతుడు గణనాథుడు. వినాయడుకు ఎలుకపై స్వారీ చేస్తూ ముల్లోకాలను సంచరిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మరి అలాంటి ఎలుక మీ కలలో కనిపిస్తే మీరు చేసే పనిలో విజయం సిద్ధిస్తుందని విశ్వాసం. అడ్డంకులు అధిగమిస్తారని అర్థం. ఆర్థిక శ్రేయస్సు కూడా మెరుగవుతుంది.

హారతి కల
గణేశుడి పూజలో చివరి ఘట్టం హారతి ఇవ్వండి. మీరు గణపతికి హారతి ఇస్తున్నట్లు కల కంటే అది సంతోషం, శాంతి, శుభవార్త, కొత్త ప్రారంభానికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు. మీరూ నిమజ్జనం తర్వాత ఇలాంటి స్వప్నాలు చూసినట్లయితే మీ జీవితంలోని అడ్డంకులు, ఇబ్బందులు తొలగిపోతాయని మంచి రోజులు రాబోతున్నాయని అర్థం..
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
