Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
సులభమైన ఈ 3 పనులు చేస్తే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది
ప్రస్తుత కాలంలో డబ్బు అనేది అత్యంత శక్తివంతమైనదిగా మారిపోయింది. డబ్బు ఉంటేనే సమాజంలో గుర్తింపుతో పాటు బంధువుల్లో కూడా గౌరవం లభిస్తుంది. అలాగే ఎలాంటి పని చేయాలనుకున్నా డబ్బు ఉంటేనే అవుతుంది. డబ్బు ఉంటేనే మనిషికి విలువ అన్న విధంగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ డబ్బులు సంపాదించేందుకు నానా రకాలుగా కష్టపడుతుంటారు.
అలాగే ఎన్నో రకాల పూజలు, పునస్కారాలు, పరిహారాలు చేస్తూ ఉన్న డబ్బును కూడా పోగొట్టుకుంటారు. అయితే కొన్ని చిన్న చిన్న పనులు చేయడం వల్ల డబ్బులు వద్దన్నా మీ ఇంట్లోకి వచ్చి పడతాయట. ఆ పనులు కూడా ఎలాంటి ఖర్చులు లేకుండా, ఎలాంటి పెద్ద పెద్ద శ్రమ లేకుండా ఉంటాయి. ఇంతకీ చేయాల్సిన పనులేమిటి? ఏ విధమైన పనులు చేస్తే లక్ష్మి కటాక్షం లభిస్తుంది? ఏ విధంగా డబ్బులు ఇంట్లో నిలువ ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే లేవడం..
ఉరుకులు పరుగుల జీవితం. రాత్రి రావడం ఉదయం వెంటనే లేచి వెళ్లిపోవడం. కుటుంబానికి సమయం కేటాయించడానికి కూడా కొంతమందికి వీలు పడడంలేదు. అందుకే చాలా మంది చిన్న చిన్న పనులను నిర్లక్ష్యం చేస్తుంటారు. అందులో భాగంగానే సాధారణంగా ప్రతి ఒక్కరూ సూర్యుడు ఉదయించిన తరువాత లేచి ఇల్లు ఊరుస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఇంట్లోనే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట.
సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి స్నానం చేసి.. ఇల్లు ఊడవాలట. ఆ లోపు ఇంటి యజమాని అయిన భర్త స్నానం చేసి.. ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కచ్చితంగా డబ్బు ప్రభావం మీ ఇంట్లో ప్రవహిస్తుందని పండిత నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోంచి పొమ్మన్నా పోదని పేర్కొంటున్నారు.
భర్తను గౌరవించడం..
పురాణాల ప్రకారం భర్తను శ్రీమహావిష్ణుతో పోలుస్తారు. అలాంటి భర్తను నేటి కాలంలో అందరం సమానమే, అంతా ఒక్కటే అనే ఉద్దేశంతో భార్యను నిర్లక్ష్యం చేస్తుంటారు. భార్యలు తమ పనిలో పడి భర్తకు కాఫీ, భోజనం పెట్టడం కూడా మర్చిపోతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి నిలవదని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి ఇంట్లోనే కొలువై ఉండాలంటే భర్తకు తగిన గౌరవం ఇవ్వాలని పేర్కొంటున్నారు.
భర్తను గౌరవించడం, వారిని ఇసుక్కోకపోవడం వల్ల లక్షమీదేవి శాంతిస్తుందని, అలాగే ఇంట్లో డబ్బు ప్రవాహం కురిసేలా చేస్తుందని చెబుతున్నారు. భర్తకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడంతో పాటు, వారికి కావాల్సినవి సమకూరిస్తే లక్ష్మీకటాక్షం లభిస్తుందని చెబుతున్నారు.
సంధ్యా సమయానికి మునుపు..
అలాగే సాయంత్రం సమయంలో కూడా ఒక పని చేయాలని చెబుతున్నారు. సాయంత్రం సూర్యుడు అస్తమానం అవ్వడానికి ముందు.. ఇంటిని శుభ్రంగా ఊడ్చుకొని దీపం వెలిగించుకోవాలి. అలాగే నీటిని శుభ్రంగా తుడుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి శాంతిస్తుందని, అలాగే ఆ ఇంట్లో నిలువ ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి ఖర్చులు లేని ఈ మూడు పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, అలాగే ఇంట్లో ధన ప్రభావం కురుస్తుందని పేర్కొంటున్నారు. ఈ పనులు చేయడానికి ఎలాంటి శ్రమ కూడా అవసరం లేదని, కాకపోతే తరచుగా నిద్రలేవడానికి ముందే నిద్రలేచి ఈ పనులు చేస్తే సరిపోతుందంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications