Latest Updates
-
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం!
పన్నెండేళ్ల తర్వాత గురుశుక్రుల మహా సంయోగం.. ఈ రాశుల వారికి రాజయోగాలే.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది జూన్ అత్యంత శుభప్రదమైన మాసంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో అరుదైన ప్రత్యేక గ్రహాల కలయిక ద్వారా కొన్ని రాశుల వారికి రాజయోగం పడుతుందని, లక్ష్మీ దేవి అనుగ్రహంతో పాటు అదృష్టం వరిస్తుంది. ఇంతకీ ఆ గ్రహాలేంటి.? ఆ గ్రహాల కలయిక కారణంగా ఏ రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఇక్కడ తెలుసుకోండి.

దాదాపు పన్నెండేళ్ల తర్వాత గురు, శుక్ర గ్రహాలు కలుస్తున్నాయి. అది కూడా జూన్‌లో ఈ అద్భుతం జరగబోతోంది. ఈ గ్రహాలు కలవడం ద్వారా నాలుగు రాశుల వారికి పంచ మహాపురుషయోగాల్లోని నాలుగు రాజయోగాలతో సిద్ధి ఉండబోతోంది. మేషం, మిథునం, కర్కాటకం, మకర రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అదెలా అంటే..
మేష రాశి వారికి ఇలా
మేష రాశి వారికి జూన్ మాసం బాగా కలిసి వస్తుంది. రుచక్ పంచ మహాపురుష రాజయోగంతో గురు, శుక్ర గ్రహాలు ఈ రాశి వారికి నాలుగో పాదంలో ఉండటంతో కష్టాలు తొలగిపోతాయి. కష్టతరమైన, సవాళ్లతో కూడిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి సంబంధిత సమస్యల పరిష్కారంతో పాటు రాజకీయ నాయకులకు గుర్తింపు దక్కుతుంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలను గడిస్తారు.
మిథున రాశి
మిథున రాశి వారికి జూన్ ఆరంభం నుంచే భద్ర పంచ మహాపురుష రాజయోగం పడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు ప్రతి పనిలో కుటుంబీకుల మద్దతు ఉంటుంది. డబ్బు ఆదా చేస్తారు. మానసిక ఒత్తిడి తగ్గి జీవితంలో సంతోషం పొందుతారు. వృత్తి జీవితంలో అభివృద్ధిని చూస్తారు.
కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటే..
బృహస్పతి సంచారంతో కర్కాటక రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. విద్య, మేనేజ్‌మెంట్ రంగాల్లో లాభాలు చూస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా వృత్తిపరంగా ఆర్థిక భవిష్యత్తులో ఏ ఢోకా ఉండదు. బంధుమిత్రులను కలవడంతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక భావం అలవరుచుకుంటారు. హంస రాజయోగం కారణంగా విజయాన్ని ఆస్వాదిస్తారు.
మకర రాశి
జూన్‌లో మకర రాశి వారికి గురు, శుక్ర గ్రహాల సంచారం కారణంగా గజలక్ష్మీ యోగంతో ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు గడిస్తారు. వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. తద్వారా వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. క్రీడా రంగంలో మంచి గుర్తింపు పొందడమే కాకుండా వివిధ రంగాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం దక్కుతుంది. జీవిత భాగస్వామితో కలిసి సుదూర ప్రయాణాలు చేస్తూ సంతోషకరమైన ఏకాంత జీవితాన్ని గడుపుతారు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా పరిష్కారమవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
