Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
కార్తీక పౌర్ణమి రోజు మీ రాశిని బట్టి చేయాల్సిన దానాలివే!..గ్రహ దోషాలు తొలగిపోతాయి!
కోటి దీపాల కాంతులతో వెలిగిపోయే కార్తీక మాసం..ఈ మాసానికే తలమానికం కార్తీక పౌర్ణమి. ఈ ఏడాది నవంబర్ 5న బుధవారం నాడు కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పవిత్రమైన రోజున ఆచరించే స్నాన, దాన, జప, తపాలకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున చేసే దానధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. మన జాతకంలోని గ్రహ దోషాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించే శక్తి దానానికి ఉందని పెద్దలు చెబుతారు.

అయితే రాశిని బట్టి వస్తువులను దానం చేయడం వల్ల గ్రహాలు శాంతించి, విశేషమైన ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం స్పష్టం చేస్తోంది. కార్తీక పౌర్ణమి రోజున మీ రాశి ప్రకారం ఏ వస్తువులను దానం చేయాలో ఇక్కడ చూడండి.
మేషరాశి
కుజుడు అధిపతిగా గల మేషరాశి కార్తీక పౌర్ణమి నాడు కుజ గ్రహ అనుగ్రహం కోసం ఎరుపు రంగుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం.
పేదలకు బెల్లం, కందిపప్పు, ఎర్రటి వస్త్రాలు, తేనె లేదా దానిమ్మ వంటి ఎర్రటి పండ్లను దానం చేయాలి. ఈ దానం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
వృషభరాశి
శుక్రుడు ఈ రాశికి అధిపతి. వృషభరాశి వారు తమ జీవితంలో భోగభాగ్యాలు పెరగాలంటే శుక్రుడికి ప్రీతికరమైన తెల్లటి వస్తువులను దానం చేయాలి.
బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, తెల్లటి నువ్వులు లేదా పాలతో చేసిన మిఠాయిలను, తెల్లటి దుప్పట్లు దానం చేయడం వల్ల దాంపత్య జీవితంలో మాధుర్యం పెరిగి, కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
మిథునరాశి
బుధ గ్రహం అధిపతిగా ఉండే మిథునరాశి వారు ఆకుపచ్చని వస్తువులను దానం చేయాలి. పెసలు, ఆకుకూరలు, ఉసిరికాయలు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది.
విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేస్తే కెరీర్ లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, విజయం వరిస్తుంది.
కర్కాటకరాశి
చంద్రుడు అధిపతిగా కలిగిన ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు చంద్రుని అనుగ్రహం కోసం పాలు, బియ్యం, చక్కెర, వెండి వస్తువులు లేదా తెల్లటి మిఠాయిలను దానం చేయాలి.
శివాలయానికి పాలను అభిషేకం కోసం ఇవ్వడం లేదా పేదలకు నీటిని దానం చేయడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు దూరమై, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.

సింహరాశి
సూర్యుడు అధిపతిగా ఉండే సింహరాశి వారు గోధుమలు, రాగి పాత్రలు, బెల్లం, నారింజ రంగు వస్త్రాలు లేదా ఎర్రటి పువ్వులను దానం చేయడం ఉత్తమం. ఈ దానం వల్ల ప్రభుత్వ పనులలో విజయం, ఆత్మగౌరవం, వృత్తిలో ఉన్నత పదవులు లభిస్తాయి.
కన్యరాశి
కన్యరాశికి కూడా బుధుడే అధిపతి. వీరు కార్తీక పౌర్ణమి నాడు పెసలు, ఆకుకూరలు, ఆకుపచ్చని వస్త్రాలు లేదా ఆవుకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. నెయ్యిని దానం చేయడం కూడా బుధ గ్రహాన్ని శాంతింపజేసి, వృత్తిపరమైన అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది.
తులరాశి
శుక్రుడు అధిపతిగా గల ఈ రాశి వారు తెల్లటి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు (అత్తరు, పర్ఫ్యూమ్), బియ్యం, నెయ్యి లేదా చక్కెర దానం చేయడం వల్ల శుక్రుడి అనుగ్రహం లభించి, ఆర్థిక స్థిరత్వం, దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతాయి.
వృశ్చికరాశి
కుజుడు అధిపతిగా ఉండే వృశ్చికరాశి వారు ఎర్రటి వస్త్రాలు, బెల్లం, ఎర్ర కందిపప్పు, దానిమ్మ వంటి పండ్లు లేదా అవసరంలో ఉన్నవారికి ధనాన్ని దానం చేయడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది.
ధనుస్సురాశి
బృహస్పతి అధిపతిగా గల ధనుస్సురాశి వారు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. శనగలు, అరటిపండ్లు, పసుపు రంగు వస్త్రాలు, పసుపు, కుంకుమపువ్వు లేదా శనగపిండితో చేసిన లడ్డూలను దానం చేయడం వల్ల జ్ఞానం వృద్ధి చెంది, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

మకరరాశి
న్యాయదేవత అయిన శని భగవానుడు ఈ రాశికి అధిపతి. మకరరాశి వారు కార్తీక పౌర్ణమి నాడు నల్ల నువ్వులు, ఆవాల నూనె, మినపప్పు, నల్లని దుప్పటి లేదా ఇనుప వస్తువులను దానం చేయడం వల్ల శని గ్రహం ప్రతికూల ప్రభావాలు తగ్గి, వృత్తి జీవితంలోని ఆటంకాలు తొలగిపోయి, విజయం చేకూరుతుంది.
కుంభరాశి
కుంభరాశికి కూడా శని భగవానుడే అధిపతి. వీరు నల్లని దుప్పట్లు, నల్ల నువ్వులు, మినపప్పు, చెప్పులు లేదా అవసరమైన వారికి ధనాన్ని దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, కెరీర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి.
మీనరాశి
బృహస్పతి అధిపతిగా ఉండే మీనరాశి శనగపప్పు, పసుపు రంగు వస్త్రాలు, శనగపిండితో చేసిన పదార్థాలు, పసుపు, పుస్తకాలు లేదా అరటిపండ్లను దానం చేయడం వల్ల గురు బలం పెరిగి, సంపద వృద్ధి చెంది, మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications