Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
నీచ స్థితిలో కుజుడు.. ఈ 5 రాశుల వారు ఏ క్షణమైనా చనిపోవచ్చు, చాలా జాగ్రతగా ఉండాల్సిందే!
జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడి తర్వాత అత్యంత ప్రమాదకరమైన గ్రహం కుజుడు అని చెబుతుంటారు. అధికారం, ఆదాయం, పోరాటాలు, రక్తపాతం, విభేదాలు మరియు వివాదాలకు కుజుడు ప్రముఖ కారణం. కుజుడు ఎప్పటికప్పుడు అప్రతీకృత ఉత్పత్తులు, సమస్యలు మరియు ఉత్పాతాలను కలిగించగల గ్రహంగా గుర్తించబడుతాడు. ఈ ఏప్రిల్ 3న కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించి నీచస్థితిలోకి వెళ్లిపోతున్నాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, నీచస్థితిలో ఉన్న కుజుడు మారణాయుధం లాంటిది. అయితే, సుందరకాండ పారాయణ మరియు సుబ్రహ్మణ్యాష్టక పఠనం ద్వారా కుజుడి చెడు ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతుంది. కర్కాటక రాశిలో జూన్ 6 వరకు కుజుడు సంచరిస్తూ, ఉంటాడు. ఆ సమయంలో కొన్ని రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారికి చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ రాశుల వారికి కుజుడు కారణంగా ఇబ్బందులు తలెత్తుతాయి, వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మిథునం: ఈ రాశి వారికి ధన స్థానంలో కుజుడు ప్రవేశించడంతో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి, కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి. మిత్రులు మరియు బంధువుల వల్ల ఆర్థిక నష్టాలు ఎదురవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గిపోతాయి, ఉద్యోగాల్లో స్థానం తగ్గుతుంది. అదనపు ఆర్థిక ఒత్తిళ్లతో సమస్యలు తలెత్తవచ్చు. ఆర్ధిక సమస్యల కారణంగా తమ కుటుంబాన్ని కూడా సరిగ్గా చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీని నుంచి విముక్తి పొందాలంటే కచ్చితంగా సుందరకాండ పారాయణం చేయడం ఉత్తమం.

సింహం: వ్యయస్థానంలో కుజుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు, విఫలమైన ఆర్థిక ప్రయత్నాలు ఎదురవుతాయి. సొమ్ము వృథా కావడం, బంధుమిత్రులు సహాయం చేయకపోవడం, దాంపత్య సంబంధాల్లో సమస్యలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే, ప్రయాణాలు, వాహనాల రవాణా గురించి జాగ్రత్త వహించాలి. ఏమాత్రం అప్రమత్తమైన ప్రాణాలకే ప్రమాదం. విదేశాల్లో పనిచేసే వారికి స్థానభ్రంశం కూడా ఏర్పడవచ్చు.
ధనుస్సు: ఈ రాశి వారికి తమ అష్టమ స్థానంలో నీచ కుజుడి ప్రవేశం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. ఆర్థిక విషయాలలో నష్టాలు, మోసాలు తప్పకుండా ఉండవచ్చు. ఆస్తి వివాదాలు పెరుగుతాయి. ప్రయాణాలు ప్రమాదకరంగా మారవచ్చు, పెళ్లి ప్రయత్నాలు కూడా సానుకూలంగా సాగవు. అన్నింటా కష్టాలే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు కూడా కొంత జాగ్రత్తతో మెలగాలి. లేకపోతే కొన్ని అనుకోని మరణ ఘడియలు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.
మకరం: సప్తమ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల కుటుంబంలో ఆందోళనలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారికి అనవసర ఖర్చులు, వృథా ప్రయత్నాలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాలలో బంధువుల నుంచి మోసాలు ఎదురవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తడం వంటివి జరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి సంబంధిత ప్రయత్నాలు సానుకూలంగా సాగకపోవచ్చు. ఆదాయం పెరగకుండానే అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుంది.
కుంభం: ఈ రాశి వారికి తమ ఆరవ స్థానంలో కుజుడు ప్రవేశించడంతో ఈ రాశివారికి రుణాలు, రోగాలు, శత్రు బాధలు వృద్ధి చెందే అవకాశం ఉంది. మనశ్శాంతి కోల్పోవడం, ఒత్తిడి పెరగడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవచ్చు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు తగ్గిపోవచ్చు. కొందరు బంధువుల నుంచి విమర్శలు విని బాధపడవచ్చు. ఆర్థిక లావాదేవీలలో నష్టాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications