Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
స్తంభించిన కుజుడు.. ఈ 6 రాశుల వారికి అపారమైన అదృష్టం.. ఆ రాశులు ఏవంటే?
గ్రహాలు అనేవి సంచరిస్తూ ఉంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ సంచారం కొనసాగిస్తాయి. అయితే ప్రస్తుతం కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్న కుజుడు ఎటూ కదలకుండా స్థంభించిపోయాడు. దీన్నే కుజ స్థంభన అంటారు. ఈ కుజ స్థంభన వచ్చే ఏడాది జనవరి 21వ తేదీ వరకు కొనసాగనుంది.
ఈ కుజ స్థంభన కారణంగా పలు రాశుల వారికి ఇబ్బందులు ఉన్నప్పటికీ, పలు రాశుల వారికి మాత్రం ధన, అధికార యోగాలు పట్టనున్నాయి. ఆ రాశులు ఏంటి? ఏ ఏ రాశులకు ఈ యోగాలు పట్టనున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వృషభం: ఈ రాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు స్థంభించిపోయాడు. దీని కారణంగా వృషభ రాశి వారికి అరుదైన రాజ, అధికార యోగాలు పట్టనున్నాయి. దీని కారణంగా వృషభ రాశి వారికి కలలో కూడా అనుకోని పెళ్లి కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం, సఖ్యత కూడా పెరుగుతుంది. సోదరసోదరీలతో సమస్యలు పరిష్కారమై, ఆస్తి, భూలాభం కలుగుతుంది. ప్రయాణాలు చేయడం వల్ల లాభం చేకూరుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

కన్య: ఈ రాశిలో కుజుడు లాభ స్థానంలో స్థంభించిపోయాడు. దీని కారణంగా కన్య రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం సమకూరనుంది. ఆదాయ మార్గాలన్నీ పెరగనున్నాయి. ఆర్ధిక సమస్యలన్నీ దాదాపు దూరం అవుతాయి. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభించి, ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్ధిక స్థితి మెరుగుపడడం వల్ల ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఈ రాశి వారు చేరుకుంటారు. కొందరు ప్రముఖులతో లాభదాయకమైన పరిచయం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది.
తులారాశి: ఈ రాశివారికి కుజుడు లాభ స్థానంలో స్థంభించిపోయాడు. ఈ స్థంభన 21వ తేదీ వరకు కొనసాగనుంది. దీని కారణంగా తులారాశి వారికి అధికార యోగం పట్టనుంది. ఉద్యోగులకు జీత భత్యాలు భారీగా పెరగనున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతో పాటు నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.
వృశ్చిక: ఈ రాశికి అధిపతి కుజుడు. అలాంటి కుజుడు భాగ్యస్థానంలో స్థంభించిపోయాడు. దీని కారణంగా ఈ రాశి వారికి అనుకోకుండా సిరి సంపదలు వచ్చి పడతాయి. ఈ రాశి వారి జాతకులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. భూమికి సంబంధించిన వివాదాలన్నీ పరిష్కారమై.. భూమి ప్రాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కలిసివస్తాయి. తండ్రివైపు ఆస్తులు చేకూరే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తీర్థ యాత్రలు చేపట్టే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.
కుంభ రాశి: ఈ రాశిలో కుజుడు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు. అదే స్థానంలో కుజుడు స్థంభించిపోవడం వల్ల ఆర్ధిక, అనారోగ్య సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందడంతో దినదినాభివృద్ధి చెందుతారు. ఉద్యోగులకు వారి వారి కంపెనీల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతాలు పెరడగంతో పాటు పదోన్నతి కూడా లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
మీనం: ఈ రాశి వారికి కుజుడు పంచమ స్థానంలో స్థంభించిపోయాడు. దీని కారణంగా మీన రాశి వారు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమై తీరుతుంది. ప్రతిభాపాటవాలు బాగా వెలుగులోకి వచ్చి ఈ రాశి వారికి సమాజంలో బాగా గుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న కుటుంబ, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తయ్యి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆశించిన విధంగానే పెళ్లిళ్లు కుదిరే అవకాశం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
