Latest Updates
-
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.!
ఈ 6 రాశుల వారికి గిఫ్ట్ ఇవ్వబోతున్న సూర్యుడు.. 2024లో వీరికి ఇదే లాస్ట్ ఛాన్స్.. మిస్ చేస్తే అంతా కోల్పోతారు!
నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు. నవగ్రహాలకు రాజుగా పేరుగాంచిన సూర్యుడు ఈరోజు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. ధనుస్సు రాశిలోకి సూర్యుడి ప్రవేశం అనేక రాశుల వారిని ప్రభావితం చేయనుంది. ఈ సంవత్సరంలో సూర్యుడి సంచారం ఇదే చివరిది కావడంతో పలు రాశుల వారు భారీగా లాభార్జన చేయడంతో పాటు మరికొన్ని రాశుల వారి తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటారు. అయితే ఈ సంవత్సరం సూర్యుడి చివరి సంచారం ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశి వారికి ఇబ్బందులు గురి చేస్తాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
ధనుస్సు రాశిలో సూర్యుని సంచారం మేషరాశికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరిగి, 2025 సంవత్సరంలో డబ్బు సమస్య ఉండకుండా ఉంటారు.

సింహ రాశి
సింహ రాశి జాతకులు సాధారణంగానే సూర్యునిచే పాలించబడతారు. అయితే ధనుస్సు రాశిలోకి సూర్యుడి సంచారం వలన ఈ రాశి వారికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అలాగే నాయకత్వ లక్షణాలు అలవరుచుకుంటాయి. వ్యాపారంలో లాభాలు భారీగా వస్తాయి. ఈ రాశివారికి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే పురోగతిని చూస్తారు. ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్న వారికి అనుకూలంగా మారుతుంది. కుటుంబ వాతావరణం కూడా సంతోషంగా ఉండబోతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో సూర్యుని చివరి సంచారము ఈ రాశి వారికి అపారమైన ప్రయోజనాలను తెస్తుంది. ఈ రాశి వారు చాలా సవాళ్లను ఎదుర్కొంటారు కానీ అవన్నీ మీ విజయానికి దారితీస్తాయి. సూర్యుడి సంచారం వలన ఈ రాశి వారికి వాహన లాభం, ధనలాభం వంటివి కలుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.
మకరరాశి
ఈ సంవత్సరంలో చివరి సూర్య సంచారము మకరరాశికి జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంది. వీరికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆ బాధ్యతలు కొత్త ఆలోచనకు దారితీస్తాయి. మీ పని మీద నమ్మకం పెరుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. గృహిణులకు లాభదాయకమైన రోజులు రానున్నాయి. పిల్లల విషయంలో మీ నిర్ణయం సముచితంగా ఉంటుంది.
మీన రాశి
సూర్యుని సంచారము మీనరాశి వారికి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాలపై స్పష్టమైన దృక్పథాన్ని తెస్తుంది. ఆర్థిక స్థిరత్వం మరియు మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి. అలాగే రాబోయే సంవత్సరంలో వీరి మంచి శ్రేయస్సుకు దారి తీస్తాయి. అలాగే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.భార్య భర్తల మధ్య సమస్యలు తొలిగిపోతాయి. కుటుంబంలో అందరి ఆరోగ్యం మంచిగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
