Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
శనిదేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండే రాశులు ఇవే.. మీది కూడా ఈ రాశేనా..?
రాశులుు, జన్మకుండలిపై శని ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శనీశ్వరుడు వారి జన్మకుండలిలో గానీ కూర్చొని ఉంటే ఇక వారికి జీవితంలో కష్టాలు, సమస్యల వస్తూనే ఉంటాయ్. కాలాన్ని బట్టి శనిప్రభావం ఉంటుంది. అయితే శనీశ్వరుడికి కాలాలతో సంబంధం లేకుండా కొన్ని రాశులపట్ల సహేతుకంగా వ్యవహరిస్తాడు. వారికి ఆపదలు రాకుండా చూస్తాడు. ఎక్కవ నష్టం జరగకుండా చూస్తాడు. శనిదేవుడి ఆశిస్సులు ఉన్న రాశులు నిజంగా అదృష్టవంతులు. అలాంటి రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
తులారాశి :
తులా రాశిలో జన్మించ వారికి శనీశ్వరుడి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రాశివారికి శుభం జరిగే విధంగా శనీశ్వరుడు ఉంటాడు. తులారాశికి చెందిన వారి కుండలలి శుభ గ్రహంతో శనీశ్వరుడు కలిసి ఉంటాడు, అందువల్ల వీరికి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. కాబట్టి తులా రాశిలో జన్మించినవారు హాయిగా శనీశ్వరుడి భయం లేకుండా బ్రతికేయవచ్చు.
వృషభ రాశి :
వృషభ రాశి వారిని శనీశ్వరుడూ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. వీరికి శనిభయం అవసరం లేదు. ఎటువంటి ఆర్థిక సమస్యలు వీరికి ఉండవు, శని ఆశీర్వాదం వల్ల జీవితం కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది.

మరకరాశి :
మకరరాశి అధిపతి శనీశ్వరుడు. మకరరాశిలో శనీశ్వరుడు ఏడు సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ వారికి ఎటువంటి హానీ తలపెట్టడు. ఈ మకరరాశుల వారికి శనీశ్వరుడి ఆశీస్సులు ఇంకా బాగా అందాలంటే శనీశ్వరుడికి పూజించాల్సిందే.
కుంభరాశి :
కుంభరాశికి కూడా శనీశ్వరుడే అధిపతి. వీరిపైన కూడా శనీశ్వరుడి ఆశీస్సులు చల్లగా ఉంటాయ్. డబ్బు విషయంలో వీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. శనికి పూజ చేస్తే వీరి భవిష్యత్తు గురించి చింతించాల్సిన పనిలేదు.
ధనుస్సు రాశి :
ధనుస్సు రాశికి బృషస్పతి అధిపతిగా ఉన్నాడు. బృహస్పతి, శనీశ్వరుడు ఇద్దరూ స్నేహితులు కాబట్టి శని ధనుస్సు రాశి వారిపై కూడా చల్లని ఆశీస్సులు కురిపిస్తాడు. వీరిపై శనీశ్వరుడి ఎంతకాలం ఉన్నప్పటికీ వీరు శని దోషం గురించి భయపడాల్సిన అవసరం ఉండదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
