ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.!

ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఆగష్టు 28వ తేదీన సంభవించనుంది. ఇది పాక్షిక గ్రహణం కాగా.. అదే తేదీన రాఖీ పౌర్ణమి జరుపుకోనున్నారు. అయితే చంద్రగ్రహణం భారత్‌లో కనిపించదు కాబట్టి.. పండుగపై దీని ప్రభావం ఉండదు. కానీ.. దీని ప్రభావం మాత్రం రాశి చక్రాలపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుంభరాశిలో శతభిష నక్షత్రంలో గ్రహణం సంభవించనుంది. కాగా.. ఈ ప్రభావం ఏయే రాశుల వారిపై పడనుంది.. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. పండితుల సలహాలు చూద్దాం..

Lunar eclipse effect on these zodiac signs think carefully while taking key decisions

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ప్రభావం కర్కాటకం, సింహ, వృశ్చిక, కుంభ రాశుల వారిపై పడనుంది. గ్రహణం సమయంలో ఈ రాశుల వారి జీవితాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. మరి వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.. నిపుణుల సలహాలు తెలుసుకుందాం..

కర్కాటక రాశి..

కర్కాటక రాశిలో జన్మించిన వారు చంద్రగ్రహణం ప్రభావంతో పలు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కుటుంబ విషయాలకు సంబంధించి ఆందోళనలు పెరగడంతో భావోద్వేగాలకు లోనై పెద్ద నిర్ణయం తీసుకుంటారు. ఇది హానికరం కావచ్చు. ప్రియమైన వారితో నమ్మకద్రోహం లేదా మనస్పర్థలు ఏర్పడవచ్చు. ఆఫీసులో ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

సింహ రాశి

సింహ రాశి వారు చంద్రగ్రహణ ప్రభావంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చేస్తున్న పనుల్లో ఆటంకం కలగవచ్చు. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు పనికిరాదు. కుటుంబీకుల్లో ఎవరికైనా ఆకస్మిక అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది. మీ ఇష్టానికి వ్యతిరేకంగా కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.

Lunar eclipse effect on these zodiac signs think carefully while taking key decisions

వృశ్చిక రాశి

చంద్రగ్రహణం ప్రభావం కారణంగా వృశ్చిక రాశి ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీరు ఒక బడ్జెట్‌ రూపొందించినా.. సడెన్‌గా వచ్చే ఖర్చులు మీ బడ్జెట్‌ను తలకిందులు చేస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఒడుదొడుకుల కారణంగా ఎలాంటి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకండి. తల్లిదండ్రులతో అభిప్రాయభేదాలు రావచ్చు. వాతావరణ మార్పుల వల్ల స్వల్పంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కుంభ రాశి

కుంభ రాశిలోనే చంద్రగ్రహణం సంభవించనున్న కారణంగా.. ఈ రాశిలో జన్మించిన వారు ఆరోగ్యం, ఉద్యోగం, లక్ష్యాలు, ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సమయంలో ఆరోగ్యపరమైన విషయాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో ఒత్తిడులతో పాటు లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు పడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Tuesday, August 25, 2026, 5:25 [IST]
Desktop Bottom Promotion