Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
1989 తర్వాత మళ్లీ ఆ పవర్ ఫుల్ యోగం..51 రోజుల గండం..మనదేశంలో జరిగే సంచలన పరిణామాలు ఇవే!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మనుషుల జీవితాలను, దేశ భవిష్యత్తును శాసిస్తాయి. నవగ్రహాలు వాటి వాటి స్వభావాలను బట్టి శుభ, అశుభ ఫలితాలను అందిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక అరుదైన, శక్తివంతమైన, కొంత ప్రమాదకరమైన గ్రహ సంయోగం జరగబోతోంది. గ్రహాల సేనాధిపతిగా, శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచే కుజుడు.. మోక్షకారకుడిగా, ఛాయాగ్రహంగా పిలువబడే కేతువుతో సింహరాశిలో కలవబోతున్నాడు. ఈ కలయికను కుజకేతు యోగం అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు, సంచలన సంఘటనలకు నాంది పలకనుందని జ్యోతిష నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏమిటీ కుజకేతు యోగం? ఎందుకింత ప్రమాదకరం?
జ్యోతిష్యశాస్త్రంలో కుజుడు అగ్నితత్వ గ్రహం. ధైర్యం, శక్తి, కోపం, యుద్ధం, భూమి వంటి వాటికి కారకుడు. ఎవరి జాతకంలోనైనా కుజుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తులు అపారమైన మేధస్సు, ధైర్యం, నాయకత్వ లక్షణాలతో రాణిస్తారు. అయితే అదే కుజుడు పాపగ్రహాలతో కలిస్తే విధ్వంసకర ఫలితాలు తప్పవు. మరోవైపు, కేతువు ఒక ఛాయా గ్రహం. తలలేని మొండెం కలిగిన కేతువును విరక్తి, ఆధ్యాత్మికత, ఆకస్మిక సంఘటనలు, రహస్యాలు, మోక్షానికి కారకుడిగా పరిగణిస్తారు. కేతువు ప్రభావం ఊహాతీతంగా, అకస్మాత్తుగా ఉంటుంది.
ఇప్పుడు ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు సూర్యుడికి ఆధిపత్యం ఉన్న సింహరాశిలో కలుస్తున్నాయి. సింహరాశి కూడా అగ్నితత్వ రాశి. అంటే కుజుడి అగ్ని, సింహరాశి అగ్ని, కేతువు ఆకస్మిక, విచ్ఛిన్నకర శక్తి.. ఈ మూడు కలవడం వల్ల "కుంజకేతు యోగం" ఏర్పడుతుంది. ఇది ఒక మండుతున్న అగ్నిగుండంలో మరింత పెట్రోల్ పోసినంత ప్రమాదకరమైనది. ఈ యోగం ఏర్పడినప్పుడు ప్రకృతి ప్రకోపాలు, రాజకీయ అల్లకల్లోలాలు, ఆకస్మిక ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని జ్యోతిష పండితులు చెబుతున్నారు.

51 రోజుల కీలక సమయం
జూన్ 7 నుంచి జూలై 28, 2025 వరకు 51 రోజుల పాటు సింహరాశిలో కుజ కేతు యుతి కొనసాగుతుంది. ఈ 51 రోజులు ప్రపంచ చరిత్రలో చాలా ప్రత్యేకమైనవిగా నిలిచిపోతాయి. చివరిసారిగా ఇలాంటి కుజకేతు యోగం సింహరాశిలో ఆగష్టు 1989లో ఏర్పడింది. ఆ సమయంలో ఈ యోగం భారతదేశ జాతకంలోని నాలుగో ఇంట్లో (సుఖ స్థానం, ప్రజలు, అంతర్గత శాంతికి సంబంధించినది) ఏర్పడింది. దాని ఫలితంగా భారత రాజకీయాల్లో పెను భూకంపం సంభవించింది. అప్పటి ప్రధాని వి.పి. సింగ్ తీసుకున్న నిర్ణయాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ఆ తర్వాత 1990లో జరిగిన కాశ్మీరీ పండితుల హృదయ విదారక వలసలకు దారితీసిన పరిస్థితులకు ఈ గ్రహస్థితే కారణమని జ్యోతిష్యులు విశ్లేషిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే నాలుగో ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుండటం ఆందోళన కలిగించే విషయం.
ప్రపంచంపై, భారతదేశంపై ప్రభావాలు
ఈ 51 రోజుల కాలంలో భూకంపాలు, అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీక్ లు, విమాన ప్రమాదాలు వంటివి పెరిగే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫానులు, గాలివానలతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో రాజకీయాల్లో ఊహించని మార్పులు, అధికార మార్పిడులు, ప్రభుత్వాలకు గడ్డుకాలం ఎదురుకావచ్చు. నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరతాయి. ప్రజలలో అసహనం, కోపం పెరిగి ఆందోళనలు, ఘర్షణలు జరిగే సూచనలున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చి దేశంలోని చాలా ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయి. ఇది వ్యవసాయానికి మేలు చేస్తుంది. వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది కొంతవరకు శుభప్రదం. బంగారం, వెండి వంటి లోహాల ధరలు గణనీయంగా పెరుగుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications