Latest Updates
-
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా..
కన్యారాశిలోకి కుజుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి ఎన్నో లాభాలు, అదృష్టం
వేద జ్యోతిష్యం ప్రకారం కుజ గ్రహాన్ని గ్రహాల కమాండర్ అని కూడా పిలుస్తుంటారు. అలాంటి అంగారక గ్రహ కదలిక, సంచారం, కలయిక, తిరోగమనం ద్వాదశ రాశుల వారిపై తప్పకుండా ఉంటుంది. ఆగస్టు 18వ తేదీన మధ్యాహ్నం 3.24 గంటలకు కుజుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
కన్యారాశిలోనే ఆక్టోబర్ 3వ తేదీ వరకు ఉంటాడు. ఈ కుజ సంచారం వల్ల ద్వాదశ రాశుల వారిపై ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే 3 రాశుల వారికి మాత్రం కాలం కలిసి రానుంది. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి
కుజ సంచారం వల్ల మేషరాశి వారికి కాలం కలిసిరానుంది. అదృష్టం వరిస్తుంది. మేషరాశి వారి 6వ ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. ఈ సమయంలో మేష రాశి వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. అలాగే ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. భూమి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండనుంది. కర్కాటక రాశి వారి 3వ ఇంట్లో అంగారకుడు సంచరించనున్నాడు. ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది.
వృశ్చిక రాశి
కుజ గ్రహ సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి కలిసి రానుంది. వృశ్చిక రాశి వారి 11వ ఇంట్లో కుజుడు కన్యారాశిలోకి సంచరించనున్నాడు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయం భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
