Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత, లక్షణాలు ఉంటాయి. ఇక, ఆయ రాశుల్లో పుట్టిన వారి జీవితాల్లో ఆ గ్రహాల సంచారం వాటి ముద్రను చూపిస్తుంది. ఈ క్రమంలో ధైర్యం, శక్తి, సిరిసంపదలు, శౌర్యం, ఆత్మవిశ్వాసానికి కారకంగా పరిగణించే కుజ గ్రహ సంచారం చాలా ప్రభావవంతమైనది. ఈ గ్రహం.. రాశి సంచారం చేసినప్పుడల్లా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. వివిధ రాశుల వారి జీవితాల్లో మార్పులు ప్రదర్శిస్తుంది. కాగా, ఈ గ్రహం సెప్టెంబర్ 18న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుండగా అక్కడే 55 రోజుల పాటు సంచరించనుంది. ఈ మంగళ గోచారం కొన్ని రాశుల చక్రాల వారికి సవాలుగా ఉన్నా.. నాలుుగు రాశుల వారికి మాత్రం జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తుంది. ఆ రాశులు, ఫలితాలు చూద్దాం..

మేష రాశిమంగళ గోచారంతో సెప్టెంబర్ 18 నుంచి రానున్న 55 రోజుల పాటు చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. ఉద్యోగం చేస్తున్న వారు తాము పడిన కష్టానికి ప్రతిఫలం అందుకుంటారు. ప్రమోషన్లు, అదనపు బాధ్యతలు మిమ్మల్ని వరిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు విపరీతంగా లాభాలు అందుకుంటారు. వ్యక్తిగతంగా కుటుంబీకులతో పుణ్యతీర్థాలకు వెళ్లే అవకాశం ఉంది. వారితో సంతోషకరమైన జ్ఞాపకాలను దాచుకుంటారు.

సింహ రాశి
కర్కాటకంలోకి కుజ సంచారం సింహ రాశి వారికి ఆర్థికంగా ఊహించని ప్రయోజనాలను అందిస్తుంది. ఆదాయం పెంచుకోవడానికి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. పై అధికారుల వద్ద మీ కష్టం, ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు లేదా ప్రాజెక్టు రావచ్చు. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ సమయం మంచి అవకాశం. కుటుంబీకుల నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అందుతుండటంతో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.

ధనుస్సు రాశి
ఇంతకాలంగా పనులు నెమ్మదించి ఒకరకమైన నిరాశ నిస్పృహలో ఉన్నవారికి మంగళ గోచారం ఉపశమనం ఇస్తుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ధనుస్సు రాశి వారు తమ ఎదుగుదలకి కొత్త అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు అందుకోవచ్చు. వైవాహిక, ప్రేమ జీవితంలో భాగస్వామితో నమ్మకం, అనురాగాన్ని పెంపొందించుకుంటారు.

మీన రాశి
మీన రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. వ్యాపార రంగంలో పార్ట్‌నర్‌షిప్‌తో ఉన్నవారు విజయం అందుకుంటారు. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి. వారి నుంచి మద్దతు అందుకుంటారు. ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి మంగళ గోచారం మీకు మంచి అవకాశాలను ఇస్తుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీ సంతానం నుంచి విద్య, ఉద్యోగం, వ్యక్తిగతంగా శుభవార్త అందుకునే అవకాశాలు మెండుగా. ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
