ఫైబర్ ఎక్కువ, ఆయిల్ తక్కువ.. కడుపుకు హాయినిచ్చే చౌ చౌ క్యారెట్ కూటు..చపాతీ,పూరీల్లోకి కిర్రాక్ టేస్ట్

Posted By:

ఆయిల్ తక్కువ ఉండి, పొట్టకు హాయినిచ్చి, ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ రోజూ తినడం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ లక్షణాలు అన్నీ ఉన్న వంటకమే చౌ చౌ క్యారెట్ కూటు(chow chow kootu). ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే దీన్ని తయారుచేస్తారు. రుచి మాత్రం వాసన చూస్తేనే కడుపు నిండిపోయే విధంగా ఉంటుంది.. అంత అద్భుతంగా ఉంటుంది. దీన్ని తయారుచేయడం కూడా చాలా ఈజీ. ఇది చపాతీ, అన్నంతో కలిపి తింటుంటే స్వర్గంలో ఊగుతున్నట్లు అనుభూతి కలుగుతుంది. డైట్ లో ఉన్నవారికి, ఎక్కువగా కారాలు తినలేనివాళ్లకు కూడా ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీ ఇంట్లోనే చౌ చౌ క్యారెట్ కూటు తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు

-చౌ చౌ(సీమ వంకాయ)
-పెసరపప్పు
-కొబ్బరి నూనె
-క్యారెట్
-పసుపు
-ఇంగువ
-పచ్చికొబ్బరి
-బియ్యం
-పసుపు
-నీళ్లు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-ఆవాలు
-జీలకర్ర
-కరివేపాకు
-నల్ల మినపప్పు

chow chow carrot kootu recipe in telugu low oil high fiber diet friendly

తయారీ విధానం

-ముందుగా 1 కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి తర్వాత అందులో నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి.

-తర్వాత ప్రెజర్ కుక్కర్ లోనే నానబెట్టిన పెసరపప్పు వేసి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి.

-పప్పు ఉడికేలోగా చౌ చౌ( సీమ వంకాయ) తీసుకని పైన చెక్కను తీసేయండి. చౌ చై అందుబాటులో లేకుంటే పచ్చి బొప్పాయి అయినా సొరకాయ, పొట్లకాయ ముక్కలైనా వాడుకోవచ్చు. ఇవి 1 కప్పు ఉండాలి.

-తర్వాత క్యారెట్ పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేయండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కట్ చేసుకున్న 1 కప్పు చౌ చౌ ముక్కలు, 1 క్యారెట్ ముక్కలు వేయండి. ఇందులోనే ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, 1కప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మెత్తగా ఉడికించాలి.

-అవి ఉడికేలోగా మిక్సీ జార్ లో 3 పచ్చిమిరపకాయలు, 1/3 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర టీస్పూన్ బియ్యం, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-ఇప్పుడు కుక్కర్ లో మెత్తగా ఉడికించిన పెసరపప్పుని గరిటతో లేదా పప్పుగుత్తితో మెదపాలి.

మాంసాహారాన్ని మించే రుచితో స్పైసీ సోయా చుక్కా..రైస్, చపాతీ, దోశలోకి బెస్ట్ సైడ్ డిష్

-మెదుపుకున్న పెసరపప్పు మిశ్రమంని పాన్ లోని చౌచౌ, క్యారెట్ ముక్కల మీద వేసి కలుపుకోండి. ఇందులో అరకప్పు నీళ్లు, రుచికి తగినంత ఉప్పు వేసి కలిపి ఉడకనివ్వండి.

-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి వేడయ్యాక అందులో 2 ఎండుమిర్చి తుంపి వేయండి, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ పొట్టు నల్ల మినపప్పు, చివర్లో కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.

-వేగిన తాలింపుని పాన్ లోని మిశ్రమంలో వేసి కలుపుకోండి. ఒక పొంగు వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆపేయండి.

-అంతే చౌ చౌ క్యారెట్ కూటు రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, October 27, 2026, 16:46 [IST]
Desktop Bottom Promotion