Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి బుధ, గురు గ్రహాల మధ్య లాభ దృష్టి యోగం ఏర్పడనుంది. ఆ రోజున ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 60-డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఈ యోగం సంభవించనుంది. అక్టోబర్ మొదటి వారం వరకు ఈ యోగం కొనసాగనుంది. గ్రహాల ఈ స్థితి పలు రాశుల వారికి కొత్త అవకాశాలను, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని, తెలివైన ప్రణాళికలకు దోహదపడనుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారు ఈ ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులు ఏంటి.. వారు జీవితంలో ఎలాంటి పరిణామాలు చూడబోతున్నారు.. ఈ కథనంలో తెలుసుకుందాం..

వృషభ రాశి
బుధ- బృహస్పతి సంయోగంతో వృషభ రాశి వారికి ఆర్థిక, కుటుంబ విషయాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కుటుంబ వ్యాపారాల్లో ఉన్నవారు కొత్త అవకాశాలు అందుకుంటారు. మీకు రావాల్సిన బకాయిలి తిరిగి మీకు అందుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉండనున్నాయి. కుటుంబ పెద్దల నుంచి మద్దతు అందుకుంటారు.

మిథున రాశి
మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉండటంతో ఈ యోగం వీరికి చాలా కీలకం కానుంది. ఈ గ్రహస్థితి కారణంగా వారిలో ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీంతో మీలో పాజిటివిటీ పెరుగుతుంది. మీడియా, మార్కెటింగ్, రైటింగ్, ఐటీ, వ్యాపార భాగస్వామ్య రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం. కొత్త ప్రాజెక్టులు లేదా ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉంది. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దీంతో వారి కెరీర్, వ్యాపార పురోగతికి నూతన మార్గాలు ఏర్పడతాయి.

కన్యారాశి
కన్యారాశి వారికి బుధుడు అధిపతి కావడంతో పని విషయంలో వీరికి ఈ గ్రహస్థితి, లాభ దృష్టి సంయోగం చాలా కీలకం కానుంది. వృత్తి పరంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు మెరుగుపడతాయి. విద్య, పరిశోధన, డేటా అనాలసిస్, ఆర్థిక రంగాల్లో ఉన్నవారు మంచి అవకాశాలు అందుకుంటారు. వారి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. విజయాలు వరిస్తాయి. గౌరవం లభిస్తుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి అధిపతి బృహస్పతి కాగా ఈ రెండు గ్రహాల కలయిక, సంయోగం వృత్తి, సామాజిక జీవితానికి కీలకం కానుంది. విదేశీ వ్యవహారాలు, కంపెనీలతో ప్రాజెక్టుల్లో వీరు లాభదాయకమైన అవకాశాలు అందుకుంటారు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు.. వృత్తి, వ్యాపారానికి మేలు చేస్తాయి. వ్యక్తిగత జీవితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
