Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
ఫిబ్రవరిలో అనుకూలమైన గ్రహ బలంతో ఈ 7 రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది..ఆదాయం మరియు సంపద రెట్టింపు అవుతుంది
ఫిబ్రవరిలో అనుకూలమైన గ్రహ బలంతో ఈ 7 రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది..ఆదాయం మరియు సంపద రెట్టింపు అవుతుంది
2023 మొదటి నెల జనవరి ముగియబోతుంది. జనవరి 14 నుండి గ్రహాలకు ఆది దేవుడైన సూర్య దేవుడు మకరరాశిలోకి సంచారం చేశాడు. ఆ తర్వాత జనవరి 17 న న్యాయ దేవుడుగా కొలిచే శనిదేవుడు తన సొంత రాశియైన కుంభరాశిలోకి సంచరించాడు. ఇక నూతన సంవత్సరం రెండవ నెల మరికొద్ది రోజుల్లో ప్రారంభకానుంది. జనవరిలో మాదిరిగా ఫిబ్రవరి నెలలో కూడా రాశులలో గ్రహాల మార్పు ఉంటుంది.

ఈ గ్రహాల మార్పుల వల్ల ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెల చాలా వరకు చాలా రాశులకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కొన్ని రాశులకు అదృష్టం, లక్ష్మీదేవి అనుగ్రహం మొండుగా ఉంటుంది. కొన్ని రాశులకు సాధారణంగా ఉంటుంది. ఇంకొన్ని రాశులకు సమస్యలు తప్పవు. మరి ఫిబ్రవరిలో అదృష్టం వరించే ఆ 7 రాశుల వారు ఎవరో ఇక్కడ చూద్దాం.

మేషరాశి
జనవరిలో మాదిరిగానే మేషరాశి వారికి ఫిబ్రవరి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈనెలలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఈ నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు ఫిబ్రవరి మధ్య నాటికి త్వరగా మీకు రావల్సిన బకాయిలు అందుతాయి. వ్యాపారవేత్తలకు పెట్టుబడులు పెట్టడానికి ఫిబ్రవరి మంచి సమయం. మీకు చాలా కాలంగా నిలిచినపోయిన డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. పనిలో విజయం సాధిస్తారు. మీకు సహకారం లభిస్తుంది.

వృషభం
వృషభరాశి వారికి కూడా ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ నెలలో లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శుభవార్తలు వింటారు. ఆశించిన ఆదాయం పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ మరియు వెంచర్స్ లో పెట్టుబడి పెట్టే వారికి లాభాలు వస్తాయి.

మిధునరాశి
మిథునరాశి వారికి ఫిబ్రవరి నెల అనుకూలమైనది. గత నెల కంటే ఈ నెలలో మీకు ఎక్కువ అదృష్టం ఉంటుంది. మీరు ఆర్థికంగా చాలా మంచి సమయం గడపబోతున్నారు. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దాంతో ఫిబ్రవరి 15 తర్వాత మీకు ఆర్థిక సమస్యలు తీరుతాయి.

కన్యరాశి
కన్యారాశి వారికి కూడా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఇది శుభ సమయం. మీరు పని సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. దీనితో పాటు, ఫిబ్రవరి చివరిలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా అనుకూలమైనది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో కొన్ని ఊహించని అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి. మీరు సంతోషంతో గడుపుతారు, వ్యాపారం బలం పుంజుకుంటుంది. నిలిచిపోయిన పనులు పునఃప్రారంభించబడతాయి.

ధనుస్సు రాశి
ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారికి గ్రహ స్థానాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు ఏ పనిచేసిన అందులో గొప్ప విజయం సాధిస్తారు.ఆర్థిక పరంగా ఈ నెలలో మీరు గొప్ప ప్రయోజనాలను పొందుతారు. షేర్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు లాభాలను పొందవచ్చు. మీరు పెట్టుబడులు పెడితే వాటి ద్వారా గొప్ప ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కు సంబంధించి శుభవార్తలు వింటారు.

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా అనుకూలంగా ఉంటుంది.ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు కెరీర్‌లో గొప్ప విజయాలు సాధించే అవకాశాలను పొందుతారు. మీరు పనిలో కొత్త బాధ్యతలను పొందుతారు.



Click it and Unblock the Notifications
