Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
ఈ రాశి వారి ప్రేమ జీవితం ఈరోజు చాలా బాగుటుంది?.. మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారా?
జోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితాన్ని రాశి చక్రాలు అనేది చాలా ప్రభావితం చేస్తాయి. గ్రహాల గమనంలో మార్పు, నక్షత్రాల సంచరాల్లో తేడా? రాశుల కలయిక, గ్రహాల కలయిక వల్ల రాశి ఫలాలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అలాగే ప్రతిరోజూ వేరే విధమైన రాశి ఫలాలు ఉంటాయి. అయితే ఈరోజు ఎవరి రాశి ఫలాలు బాగున్నాయి? ఏ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి:
ఈ రాశి వారు ఈరోజు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ముఖ్యమైన పనులన్నిటినీ వదిలేసి, నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. ఆ పనిని పూర్తి చేయడంపై ద్రుష్టి పెట్టాలి. ఈ రాశివారికి తమ భాగస్వామితో మంచి సంబంధం ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రాశివారికి ఈరోజు అనుకూలం. పలు రుణాలు చెల్లించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యాన్ని కొంచెం చూసుకుంటే మంచిది.

వృషభ రాశి:
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహనాన్ని కోల్పోకూడదు. మీ పనిపై ద్రుష్టి పెట్టి ఆ పనిని పూర్తి చేసేందుకు శ్రమించాలి. ఆర్ధిక విషయాల్లో కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపు చేసుకుంటే చాలా మంచిది.
మిథున రాశి
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా చాలా బాగుటుంది. ఆర్ధిక పరంగా కూడా అనుకున్న విధంగానే ఈరోజు గడుస్తుంది. నిజానికి చెప్పాలంటే ఈ రాశివారు ఈరోజు తమ వృత్తి, వ్యాపారం, ఉద్యోగ జీవితంలో చాలా బిజీ బిజీగా గడుపుతారు. అలాగే తమ భాగస్వామితో పలు ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. ఈ రాశివారికి నేడు ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండనుంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఆర్ధిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులపై అదుపు లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారు ఈరోజు తమపై తమకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో తమ కెరీర్‌పై ద్రుష్టి సారిస్తారు. తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉంటుంది. ఉద్యోగంలో సహుద్యోగుల సహకారం మెండుగా లభిస్తుంది.
కన్య రాశి
ఈ రాశి వారు నేడు తమ పనిపై ద్రుష్టి పెట్టాలి. అలాగే తమ పనిని పూర్తి చేసుకోవడానికి కొత్త ప్రణాలికను రూపొందించుకుంటారు. ఈ రాశి వారు తమ భాగస్వామితో నేడు పలు విషయాల గురించి చర్చిస్తారు. ఇది వారి మధ్య ఉండే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చూపుతుంది. పరిమితులకు లోబడి ఖర్చులు చేస్తే మంచిది.
తుల రాశి
ఈ రాశి వారు నేడు చాలా గందరగోళానికి గురవుతారు. తమ కెరీర్‌లో బలపడడానికి తమ నైపుణ్యాలను, బలహీనతలను గుర్తించి ముందుకు సాగుతారు. ఆర్ధిక వ్యవహారాల్లో ఆచూతూచి వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి నేడు కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉండనుంది. అలాగే తమ భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచి రోజు. ఆర్థికంగా కూడా ఈ రాశివారికి కలిసి వస్తుంది. అయితే ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ధనుస్సు రాశి:
ఈ రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. తమకు అప్పగించిన పనిని పూర్తి నిబద్దతతో ఖచ్చితత్వంతో పూర్తి చేస్తారు. బంధాలలో చిన్న చిన్న సమస్యలను ఈ రాశి వారు నేడు పరిష్కరించుకోగలుగుతారు.
మకర రాశి
ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా తమ బంధాలపై ద్రుష్టి సారించాలి. తన బంధం నిర్వీర్యం అయ్యే అవకాశం ఉన్నందున తమ బంధంలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలి. వృత్తి జీవితంపై పట్ల కూడా కొంత శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది. ఆర్ధిక వ్యవహారాల్లో కంచెం జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి
ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టె ముందు నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. ఈ రాశి వారి కుటుంబ జీవితం బాగుటుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
మీన రాశి
ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా అమోఘంగా ఉంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల పలు ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగె అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడంపై ద్రుష్టి పెట్టాలి. భాగస్వామి మధ్య అనవసర సమస్యలు వచ్చే ఛాన్సుంది. వాటిని పరిష్కరించుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
