Latest Updates
-
ఒకే రకమైన ఎగ్ కర్రీ తిని విసిగిపోయారా? ఒక్కసారి ఈ నేపాల్ స్టైల్ ఎగ్ రెసిపి తింటే జన్మలో మర్చిపోరు! -
షుగర్ వ్యాధి వచ్చే ముందు కనబడే సంకేతాలు ఇవే! -
బిర్యానీకి మించిన రుచి..తక్కువ మసాలాలతో పిల్లలు,పెద్దలు మెచ్చే మొరాదాబాదీ చికెన్ పులావ్ ఇలా వండండి! -
India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? -
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో ఈ సాంబార్ చేసుకుంటే..జలుబు, తలనొప్పి అన్నీ పరార్! -
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి.. -
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి.. -
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్.. -
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే!
చేపల వేపుడును మించిపోయే రుచితో కందగడ్డ ఫ్రై.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండి ఇలా!
మధ్యాహ్న భోజనంలో వేడివేడి సాంబార్ అన్నంతో పాటు తినడానికి అద్భుతమైన సైడ్ డిష్ కోసం చూస్తున్నారా? నాలుకకు కమ్మని విందు చేసేలా, తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నారా? అయితే మీ ఇంట్లో ఉన్న కందగడ్డతో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మామూలుగా చేసే వేపుడులా కాకుండా, అచ్చం చేపల వేపుడు రుచితో దీనిని తయారు చేస్తే ఆ మజానే వేరు.
చాలామంది కందగడ్డ తింటే నాలుక దురద పుడుతుందనే భయంతో దీనిని దూరం పెడుతుంటారు. కానీ సరైన పద్ధతిలో, చింతపండు పులుపు జోడించి ఇలా వండితే అసలు దురద అనే మాటే ఉండదు. నిజానికి కందగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి దీని రుచి చూస్తే ఆహా అనాల్సిందే. ముఖ్యంగా శాఖాహారులకు ఇది చేపల వేపుడుకు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. నోరూరించే ఈ కరకరలాడే కందగడ్డ వేపుడును ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఉడికించడానికి:
కందగడ్డ- 300 గ్రాములు (పల్చగా, చదునైన ముక్కలుగా కోసుకోవాలి)
నీరు - ఉడికించడానికి సరిపడా
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు- కొద్దిగా
మసాలా పట్టించడానికి:
కశ్మీరీ కారం - ఒకటిన్నర టీస్పూన్లు
గరం మసాలా - 1 టీస్పూన్
మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్) - ఒకటిన్నర టీస్పూన్లు
బ్రౌన్ రైస్ పిండి (లేదా నల్ల బియ్యం పిండి) - ఒకటిన్నర
టీస్పూన్లు
చింతపండు - చిన్న ఉసిరికాయంత
నూనె - వేయించడానికి తగినంత
ఒకే రకమైన ఎగ్ కర్రీ తిని విసిగిపోయారా? ఒక్కసారి ఈ నేపాల్ స్టైల్ ఎగ్ రెసిపి తింటే జన్మలో మర్చిపోరు!
తయారీ విధానం
-ముందుగా కందగడ్డ తొక్కను జాగ్రత్తగా తీసేసి, సన్నగా, చదునుగా (చేప ముక్కల ఆకారంలో) కోసి శుభ్రంగా కడుక్కోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో తగినన్ని నీళ్ళు పోసి, అందులో పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు కోసి పెట్టుకున్న కంద ముక్కలను వేసి సరిగ్గా 5 నిమిషాలు ఉడికించాలి. ముక్కలు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఉడికితే చాలు. ఆ తర్వాత నీళ్ళను వంపేసి, ఉడికించిన ముక్కలను ఒక వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఈ ముక్కలపై కశ్మీరీ కారం, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, బ్రౌన్ రైస్ పిండి, అలాగే చింతపండు రసం వేసి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలపాలి. అవసరమైతే మసాలా ముక్కలకు బాగా అంటుకోవడానికి ఒక చెంచా నీళ్ళు చిలకరించవచ్చు. దీనిని కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వాలి.
-చివరగా స్టవ్ పై పెనం పెట్టి వేడి అయ్యాక, నానబెట్టిన కంద ముక్కలను ఒక్కొక్కటిగా పేర్చాలి. పైన చుట్టూ కొద్దిగా నూనె వేసి, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి చేప ముక్కలను వేయించినట్లుగా అటు ఇటు తిప్పుతూ వేయించాలి. ఒక్కో వైపు 4 నుండి 5 నిమిషాలు బంగారు రంగులోకి వచ్చి, కరకరలాడే వరకు కాల్చుకుని తీసేయాలి.
-అంతే పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రుచికరమైన కందగడ్డ ఫ్రై రెడీ. దీనిని వేడివేడి సాంబార్ అన్నం, రసం, పెరుగు అన్నం లేదా పప్పు అన్నంతో పాటు తింటే ఆ రుచే అద్భుతం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
