అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.!

జ్యోతిష్య పరంగా అక్టోబర్ 2026 చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఈ నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు రాశి చక్రాలను మార్చుకోనున్నాయి. రాహు, కేతువులు, గురుడు, కుజుడు, శని తమ స్థానాల్లోనే ఉండనున్నాయి. ఇక, చంద్రుడు ప్రతి 36 గంటలకు రాశి మారనున్నాడు. ఈ గ్రహ స్థితి ప్రభావం అన్ని రాశులపైనా ఉండనుంది. ఈ క్రమంలో అక్టోబర్‌లో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి జాతక చక్రం ఎలా ఉండనుందో చూద్దాం..

October month horoscope for all 12 zodiac signs 3 planets transition impact

మేష రాశి జాతకం

మేష రాశి వారు అక్టోబర్‌ నెలలో తీపి, చేదు రెండు అనుభవాలు పొందనున్నారు. శుభవార్తల పరంగా కుటుంబంలో పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నెల మధ్యలో శుభకార్యాలకు హాజరు కావచ్చు. అయితే ఆస్తి విషయంలో సోదరుల మధ్య వివాదాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మీరు అవమానానికి గురయ్యారనే బాధ మిమ్మల్ని కలచివేస్తుంది. దీనిని ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మలుచుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా, తెలివిగా ఉండండి. చేస్తున్న పనిలో నిజాయతీగా ఉంటే క్లిష్టమైన పరిస్థితులను సైతం అధిగమిస్తారు. పెండింగ్‌ పనులు పూర్తి కావచ్చు.

ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.!ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.!

వృషభ రాశి

వృషభ రాశి వారు వృత్తిపరంగా అనుకున్నవి నెరవేర్చుకోవడానికి ఇది మంచి సమయం. పనులు సమయానికి పూర్తవుతాయి. కష్టానికి తగిన ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులకు బిజినెస్‌ విస్తరించుకునే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. దీంతో ఆదాయం మెరుగుపడనుంది. ఇక వ్యక్తిగతంగా విదేశాలకు వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్న వారికి ఈ నెలలో కలిసి రానుంది. స్నేహితుల నుంచి సపోర్ట్‌ అందుకుంటారు. పండుగలను సంతోషంగా జరుపుకొంటారు. భూ, ఆస్తి విషయాల్లో మీకు ఆశించిన లాభాలు రావచ్చు.

మిథున రాశి

మిథున రాశి వారు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు పొందవచ్చు. విద్యార్థులకు ఈ నెల కలిసి రానుంది. అయితే ఎవరైనా మిమ్మల్ని ఊబిలో నెట్టాలని ప్రయత్నించవచ్చు. వారి మాటలు గుడ్డిగా నమ్మకుండా విచక్షణను ఉపయోగిస్తే మంచిది. ఆదాయం బాగున్నా.. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులు లాభాలు చూస్తారు. పనితీరుతో కస్టమర్లు సంతృప్తి చెందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఉద్యోగం విషయంలో నెల ప్రారంభంలో ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడితో ఆందోళనకు గురవుతారు. ఈ క్రమంలో కొంచెం విశ్రాంతి తీసుకుంటే అంతా సెట్‌ అవుతుంది. సంపాదనకి సంబంధించి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబీకులు, స్నేహితుల మద్దతు ఉంటుంది. పనిచేసే చోట బహుమతులు అందుకుంటారు. వ్యాపారంలో ఆఫర్లు రావచ్చు.

October month horoscope for all 12 zodiac signs 3 planets transition impact

సింహ రాశి

సింహ రాశి వారు అక్టోబర్‌లో ఆదాయపరంగా సంతృప్తి చెందుతారు. పనిలో ఉపశమనం పొందుతారు. అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో విజయం అందుకుంటారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో లాభం పొందుతారు. కుటుంబీకుల మధ్య పాత విభేదాలు పరిష్కారమై సంతోషంగా ఉంటారు. వ్యాపారస్థులకు ఈ నెల కలిసి వస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్త అందుకోవచ్చు. చట్టపరమైన విషయాలను దూరంగా ఉండండి.

గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!

కన్యారాశి

కన్యా రాశి వారు ఈ నెల కష్టాలను తమంతట తామే కొని తెచ్చుకుంటారు. బద్దకం వల్ల ప్రణాళిక వేసుకున్న ప్రాజెక్టు సడెన్‌గా ఆగిపోతుంది. అజాగ్రత్త తగదు. గొడవలు, వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఆదాయం మెరుగవుతుంది. మీ వాక్చాతుర్యంతో ఇతరులను ప్రభావితం చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది.

తులా రాశి

తులా రాశి వారికి అక్టోబర్‌ నెల ఎనలేని అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఒక్కసారిగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో కలిసి టూర్‌కి వెళ్లొచ్చు. మీ పిల్లలతో పాత వివాదాలు ముగిసిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. పెద్ద పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తప్పనిసరి. వైవాహిక జీవితంలో అవగాహన మెరుగ్గా ఉంటుంది. నూతన జంటలు రొమాంటిక్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి అక్టోబర్‌లో ఆదాయం స్థిరంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాల్లో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ రహస్య ప్రణాళిక సక్సెస్‌ కావచ్చు. కొత్త స్నేహితులు దొరుకుతారు. సింగిల్‌గా ఉన్న వారు మింగిల్‌ అయ్యే సూచనలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ నెల కలిసి వస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు అక్టోబర్‌లో ఆచితూచీ వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. ఉద్యోగం చేసే చోట సహోద్యోగులతో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అందుకుంటారు. ఫ్యామిలీతో కలిసి టూర్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. అయితే పిల్లలకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం.

మకర రాశి

మకర రాశి వారికి అక్టోబర్‌లో ఇంటికి అతిథుల రాక పెరుగుతుంది. సోదరుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు సక్సెస్‌ అవుతాయి. ప్రాజెక్టును డెడ్‌ లైన్స్‌లోగా పూర్తి చేస్తారు. దీంతో ప్రమోషన్లు అందుకోవచ్చు. ఆస్తి సంబంధిత విషయాల్లో ఆదాయం మెరుగయ్యే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే నెల మధ్యలో అత్తింటి వారితో విభేదాలు తలెత్తవచ్చు.

కుంభ రాశి

కుంభ రాశి వారు అక్టోబర్‌లో విహారయాత్రలు చేయొచ్చు. కుటుంబ జీవితం బాగుంటుంది. శుభకార్యాలకు వెళ్లవచ్చు. ఆదాయం మెరుగవుతుంది. ఉద్యోగంలో లక్ష్యాలను సాధిస్తారు. కానీ వ్యాపారస్థులు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోవచ్చు. కానీ మీలో పట్టుదల పెరుగుతుంది. వైవాహిక జీవితంలో శుభవార్తలు అందుకుంటారు.

మీన రాశి

మీన రాశి వారికి అక్టోబర్‌లో అతిథుల రాక ఎక్కువగా ఉంటుంది. కుటుంబం నుంచి మద్దతు అందుకుంటారు. ఆస్తి సంబంధిత విషయాల్లో కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. శుభవార్తలు అందుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Wednesday, September 30, 2026, 5:31 [IST]
Desktop Bottom Promotion