Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
2025లో ఏర్పడనున్న మొట్ట మొదటి యోగం.. ఈ రాశుల వారి పంట పండినట్లే!
జోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం చాలా శుభ సూచకాలతో ప్రారంభం కానుంది. దానికి నిదర్శనం పట్టేలా వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుస్సు రాశిలోకి బుధ, రవి గ్రహాలు కలుసుకోనున్నారు. దీని కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఈ యోగం కారణంగా పలు రాశుల వారికి శుభ పరిణామాలు జరగనున్నాయి. ఆ రాశుల వారికి అనేక శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రాశులు ఏవంటే?
మేషం
ఈ రాశి వారికి భాగ్య స్థానంలో రవి, బుధ గ్రహాలు కలుసుకోనున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రభావం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అనేక విధాలుగా డబ్బు వస్తుంది. సమాజంలో ప్రాముఖ్యత ఎక్కువ అవుతుంది. వ్యక్తిగత జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలిగిపోతాయి. ఊహించని విధంగా ఈ రాశి వారి జీవితంలో శుభపరిణామాలు జరుగుతాయి.

మిథునం
ఈ రాశికి అధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్న రవితో కలవడం వల్ల ఈ రాశికి చెందిన వ్యాపారులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వ్యాపార భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారమై వ్యాపారంలో లాభాలు పొందుతారు. ప్రభుత్వం పరంగా ఈ రాశి వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో ఏర్పడే సంబంధాలు భారీగా లాభాలను తీసుకురానుంది. ఆదాయం పెరగడంతో పాటు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అలాగే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. దీంతో పాటు మంచి పెళ్లి కుదురుతుంది.
సింహ
ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడంతో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. ఆస్తుల విలువలు పెరుగుతాయి. సంతాన సంబంధిత శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది.
వృశ్చిక
ఈ రాశివారికి ధన స్థానంలో రవి, బుధ గ్రహాల కలయిక జరగనుంది. దీని కారణంగా ఈ రాశి వారికి శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలో మారే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా లబ్ధిపొందుతారు. ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయి. కుటంబంలో కలహాలు దూరమవుతాయి.
ధనుస్సు
ఈ రాశిలోనే బుధ, రవి గ్రహాల కలయిక జరగడం వల్ల ఈ రాశి వారికి సమాజంలో ప్రముఖుడిగా గుర్తింపు లభిస్తుంది. అలాగే ఈ రాశి వారి ఆదాయం భారీగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి ఆస్కారం ఉంటుంది. సంతాన లాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కుంభం
ఈ రాశి వారికి లాభ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక జరగనుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఆర్థికంగా భారీగా లాభాలు చేకూరనున్నాయి. వృత్తి, వ్యాపారాలతో పాటు ఉద్యోగంలో కూడా ఉన్నత స్థానాలకు వెళ్తారు. వ్యక్తిగత, ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారమై ఒత్తిడిని దూరం చేస్తాయి. భారీగా ఆదాయం లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications