Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
రాహు ప్రభావంతో మోదీ జాతకంలో కీలక మలుపులు..4వ సారి ప్రధాని అయ్యే ఛాన్స్ లేనట్లేనా?
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో పాలిటిక్స్ కు రిటైర్మెంట్ తీసుకోబుతన్నారని,ఆయన వారసుడిని ఆర్ఎస్ఎస్ ఎంపిక చేయబోతుందంటూ గత కొద్ది రోజులుగా ప్రధాన మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మార్చి 30న నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన తర్వాత శివసేన(UBT) నేత సంజయ్ రౌత్ హాట్ తమ పార్టీకి చెందిన సామ్నా పత్రికలో రాసిన ఎడిటోరియల్ లో కీలక కామెంట్స్ చేశారు.
సెప్టెంబర్ లో మోదీకి 75 ఏళ్లు వస్తాయని, మోదీ తన రిటైర్మెంట్ కి ఫ్లాన్ చేసుకుంటున్నారని,ఈ విషయం గురించే ఆయన RSS ఆఫీసుకి వెళ్లి ఉండొచ్చని..గత 10-11 ఏళ్లలో మోదీ ఎప్పుడూ RSS హెడ్ క్వార్టర్ కి వెళ్లలేదని..ఇప్పుడు వెళ్లడానికి కారణం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని RSS చీఫ్ మోహన్ భగవత్ కి చెప్పేందుకేనని సంజయ్ రౌత్ అన్నారు. 2029 ఎన్నికల్లో మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేయబోరని, మోదీ వారసుడిని RSS ఎంపిక చేస్తుందని, మహారాష్ట్ర నుంచే తదుపరి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేయోచ్చు అని సంజయ్ రౌత్ అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి.

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సహా అనేకమంది బీజేపీ నేతలు సంజయ్ రౌత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా మోదీనే దేశ ప్రధానిగా ఉంటారని చెప్పారు. అయితే అసలు మోదీ జాతకం ఎలా ఉంది? 2029లో నాలుగోసారి ప్రధాని అవగలరా? ఈ ప్రశ్నలకు జ్యోతిష్య పండితులు ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
మోదీ రాశి ఇదే
గుజరాత్ రాష్ట్రంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 సెప్టెంబర్ 17న మధ్యాహ్నాం 12: 09 గంటలకు నరేంద్రమోదీ జన్మించారు. వృశ్చిక లగ్నం,వృశ్చిక రాశిలో జన్మించి మోదీ జాతకంలో గ్రహాల కలయిక ఎన్నో ప్రత్యేకతలకు సంతరించుకుంది.
రాజయోగం బలంగా
మోదీ జాతకచక్రంలో రాజయోగం చాలా బలంగా ఉంది. అందుకే ఆయన జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా విజయ శిఖరాలను అధిరోహించారు. సూర్యుడు, శని కలయిక ఆయన జీవితంలో పోరాటం,వైరుధ్యాలను సూచిస్తున్నప్పటీకీ..అదే సమయంలో ఆయనకు అపారమైన శక్తిని ఇచ్చింది. మోదీ జాతకంలో దృఢ సంకల్పం, శౌర్యం,సామర్థ్యం సృష్టంగా కనిపిస్తున్నాయని జ్యోతిష్య పండితులు తెలిపారు.
రాహు మహాదశ, రాజకీయ భవిష్యత్తు
2028లో మోదీకి రాహు మహాదశ ప్రారంభమవుతుందని..ఇది ఆయన జీవితంలో అనేక అనూహ్య మార్పులకు దారితీస్తుందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కొందరు జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం రాహు మహాదశ ప్రభావం వల్ల మోదీ 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా కాకుండా ఒక బాహ్య శక్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని..అయితే మోదీ జాతకం మాత్రం ఆయన జీవితంలో మరిన్ని ఆసక్తికరమైన మలుపులు ఉంటాయని సూచిస్తోందని కొందరు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications