Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
మార్కెట్లో దొరికే ప్యాకెట్ చిప్స్ ను చాలామంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కానీ వాటి వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం ఉంటుంది. ఆ చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం రసాయనాలు వాడతారు. అలాగే వాటిలో సోడియం శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పిల్లల ఎదుగుదలపై, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. బేకింగ్ సోడా లాంటివి ఏమీ వాడకుండానే, అచ్చం బయట దొరికేలా అత్యంత పలుచగా, తెల్లగా, కరకరలాడే బంగాళాదుంప చిప్స్ ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

బంగాళాదుంప చిప్స్ తయారీకి కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు - 4 పెద్దవి
ఐస్ వాటర్ - 3 నుంచి 4 కప్పులు
ఉప్పు - తగినంత
చాట్ మసాలా - 1 టీస్పూన్
మిరియాల పొడి లేదా కారం - అర టీస్పూన్
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
బంగాళాదుంప చిప్స్ తయారీ విధానం
-ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి పీల్లర్ సహాయంతో తొక్క తీసేయండి. ఇప్పుడు ఒక మంచి స్లైసర్ తీసుకుని వాటిని చాలా పలుచని చిప్స్ లా తురుముకోవాలి. మీరు కట్ చేసే ముక్కలు ఎంత పలుచగా ఉంటే, చిప్స్ అంత కరకరలాడుతూ వస్తాయి.
-స్లైస్ చేసిన చిప్స్ ముక్కలను వెంటనే చల్లటి ఐస్ వాటర్ లో వేయాలి. ఆ తర్వాత ఆ నీటిని పారబోసి, మరో రెండు మూడు సార్లు స్వచ్ఛమైన నీటితో కడగాలి. నీరు పూర్తిగా తేటగా కనిపించేవరకు కడగాలి. ఇలా చేయడం వల్ల ఆలూలో ఉండే స్టార్చ్ (పిండి పదార్థం) పూర్తిగా తొలగిపోతుంది. ఇదే చిప్స్ మార్కెట్ వాటిలా తెల్లగా, కరకరలాడేలా చేస్తుంది.
-ఇప్పుడు నీటిలో నుంచి చిప్స్ ముక్కలను బయటకు తీసి, ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంపై లేదా కిచెన్ టిష్యూ పేపర్‌పై విడివిడిగా పరచాలి. పైన మరో వస్త్రంతో మెల్లగా అద్దుతూ తేమను పూర్తిగా పీల్చేలా చేయాలి. ముక్కలపై ఒక్క చుక్క నీరు లేదా పచ్చిదనం ఉండకూడదు.
-స్టవ్ వెలిగించి మందపాటి కడాయిలో నూనె పోసి బాగా వేడి చేయండి. నూనె బాగా వేడెక్కాక, మంటను మీడియం ఫ్లేమ్ కి తగ్గించండి. ఇప్పుడు ఆరబెట్టిన ఆలూ ముక్కలను కొద్దికొద్దిగా నూనెలో వేయండి. కడాయికి సరిపడా మాత్రమే వేయాలి, ఒకేసారి ఎక్కువగా వేస్తే అంటుకుపోయి సరిగ్గా వేగవు.
-నూనెలో వేయగానే వచ్చే బుడగలు తగ్గేంత వరకు గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ వేయించాలి. అవి ఎర్రగా లేదా బ్రౌన్ కలర్ లోకి మారకముందే, లేత బంగారు రంగు లేదా తెల్లగా ఉన్నప్పుడే బయటకు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. చిప్స్ వేడిగా ఉన్నప్పుడే వాటిపై కొద్దిగా ఉప్పు, కారం లేదా మిరియాల పొడి, చాట్ మసాలా చల్లి బాగా కుదపాలి.
-అంతే ఆరోగ్యకరమైన హోమ్ మేడ్ ఆలూ చిప్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications