Latest Updates
-
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది!
ఈ రాశుల వారికి అరుదైన చంద్ర మంగళ యోగం.. యోగం కలగాలంటే ఇలా చేయాలి..!
గ్రహాల కలయికల వల్ల యోగాలు ఏర్పడతాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈనెల 24, 25, 26వ తేదీల్లో చంద్రుడు, కుజుడు కర్కాటక రాశిలో కలియిక చెందనున్నారు. దీని కారణంగా చంద్ర యోగం అని పిలవబడే ఒక ధన యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం ఈనెల 27వ తేదీ వరకు ఉంది.
ఈ యోగం కారణంగా పలు రాశుల వారికి ధన యోగం పట్టనుంది. ఆ రాశుల వారికి ధనార్జన పెరగడంతో పాటు ఆదాయం వచ్చే మార్గాలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు వారు చేపట్టే కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ ఏ రాశుల వారికి యోగం పట్టనుందంటే
మేష రాశి: ఈ రాశి వారికి నాలుగో స్థానంలో కుజుడు, చంద్రుడి కలయిక జరగనుంది. దీని కారణంగా మేష రాశివారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండనుంది. ఈ యోగం కారణంగా మేష రాశి వారి ఆస్తి వివాదాలు చక్కబడనున్నాయి. వివాదాలు పరిష్కారమై ఆస్తి చేతికి దక్కనుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వారికి క్రయ, విక్రయాల్లో లాభాలు దక్కనున్నాయి. అనేక విధాలుగా ఆదాయం వచ్చి పడనుంది. షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి కూడా అనుకూలంగా ఉండనుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. అలాంటి రాశ్యధిపతి చంద్రుడు కుజుడిని కలవడం వల్ల కర్కాటక రాశి వారికి అనూహ్యంగా ధనలాభం చేకూరనుంది. అనుకోకుండా కొన్ని భూములు కలిసివస్తాయి. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు గడిస్తారు. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి కూడా పొందుతారు. ఉద్యోగంలో జీత భత్యాలు పెరగనున్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన సమయంగా చెప్పుకోవచ్చు.
కన్య రాశి: ఈ రాశి వారికి.. చంద్రుడు, కుజుడుల కలయిక లాభస్థానంలో జరగనుంది. దీని కారణంగా కన్యారాశి వారికి ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి లాభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయ మార్గాలు ఏర్పడి, లాభాలు పొందే అవకాశముంది. ఆస్తి, గృహ ఒప్పందాలకు ఇది అనువైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొని పెట్టుకున్న ఆస్తుల విలువ కూడా బాగా పెరిగే అవకాశముంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టె వారికి కూడా లాభాలు రానున్నాయి. సుసంపన్నమైన కుటుంబంతో కన్యారాశి వారికి పెళ్లిళ్లు కుదిరే అవకాశం ఉంది.
తుల రాశి: చంద్ర మంగళ యోగం అనే ఈ ధన యోగం.. తులా రాశి వారికి దశమ స్థానంలో పట్టనుంది. దీని కారణంగా ఈ రాశి వారికి తండ్రి వైపు నుంచి ఆస్తి లాభం జరగనుంది. అలాగే ఉద్యోగాల్లో ప్రొమోషన్స్, జీతాలు పెరగడం వంటి మంచి పనులు చోటు చేసుకోనున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో దూసుకెళ్లనున్నాయి. సంపద లాభాల్లో దూసుకెళ్లనుంది.
వృచ్చిక రాశి: ఈ రాశి వారికి అత్యంత అరుదైన ఈ చంద్ర మాంగళ్య యోగం రెండుసార్లు పట్టనుంది. ఈ రాశికి అధిపతి అయిన కుజుడుతో చంద్రుడు కలవడం వల్ల.. ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశముంది. అలాగే విదేశీ డబ్బు కూడా ప్రాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితం మూడు పూలు ఆరు కాయలుగా సాగనుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పొందుతారు.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ ధనయోగం పంచమ స్థానంలో పట్టనుంది. దీనికారణంగా ఈ రాశి వారికి ఈనెల 27వ తేదీ వరకు లాభ కాలం కొనసాగనుంది. రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అన్ని రకాలుగా ఈ రాశివారికి కాలం అనుకూలంగా ఉండనుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications