Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
శనీశ్వరుడి అనుగ్రహం.. నవంబర్ 15 నుంచి ఈ రాశుల వారికి ఇక తిరుగు ఉండదు! ప్రపంచాన్నే ఏలేస్తారు!
నవ గ్రహాల్లో శనీశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహం. శనీశ్వరుడిని కర్మ ప్రదాత అని కూడా పిలుస్తుంటారు. అత్యంత భయంకరమైన గ్రహంగా కూడా శని గ్రహాన్నే చెప్పుకుంటూ ఉంటారు. అన్ని గ్రహాల కంటే శని గ్రహం నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి శని రెండున్నరేళ్ల సమయం తీసుకుంటారు.
అయితే ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో ఉన్న శని ఛత్ పూజ తరువాత నేరుగా అడుగుపెట్టనున్నారు. దీని కారణంగా పలు రాశుల అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శని ఎప్పుడు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడంటే?
కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు, ప్రస్తుతం ఆయన అదే రాశిలో తిరోగమనంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఛత్ పండగ తరువాత.. అంటే నవంబర్ 15వ తేదీ సాయంత్రం 5.09 గంటలకు నేరుగా కుంభరాశిలోకి అడుగుపెట్టనున్నారు. దీని కారణంగా 12 రాశులు ప్రభావితం కానున్నాయి. వాటిలో కొన్ని రాశుల వారికి శుభయోగం పట్టుకోనుంది.

ఏ ఏ రాశుల వారికి లాభమంటే?
వృషభ: శనీశ్వరుడు తన గమనాన్ని మార్చుకోవడం వల్ల.. వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో ఉన్న వృషభ రాశి జాతకులు.. అనూహ్యంగా లాభాలను గడిస్తారు. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు భారీగా ఆదాయం లభిస్తుంది. దీంతోపాటు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మంచి వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
కన్య: శనీశ్వరుడి కదలిక కారణంగా ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. శనీశ్వరుడి అనుగ్రహంతో కన్య రాశివారు తమ పాత అప్పులను తీర్చుకోగలుగుతారు. దీర్ఘకాలంగా పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి.
తులా రాశి: శని మహారాజ్ కుంభరాశిలోకి నేరుగా ప్రవేశించడం కారణంగా తులా రాశి జాతకుల జీవితం మారిపోనుంది. రెండున్నర సంవత్సరాల పాటు ఈ రాశి వారికి శుభకాలం ఉండనుంది. దీని కారణంగా ఈ రాశి వారు భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి. తండ్రికి సంబంధించిన ఆస్తి చెందే అవకాశం కనిపిస్తుంది.
కుంభ: ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. అలాంటి శనీశ్వరుడు ఈ రాశిలోకి నేరుగా ప్రవేశించనున్నాడు. దీని కారణంగా ఈ రాశి జాతకులకు అత్యంత శుభకాలం ఉండనుంది. శనీశ్వరుడు ప్రత్యక్షం కారణంగా ఈ రాశివారు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. పాత సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటారు. ఆర్ధిక రంగంలో బాగా రాణిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఈ రాశివారు ఏ రంగంలో పని చేసినా వారికి బాగా కలిసి వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
