Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
తిరోగమనంలో శని.. నవంబర్ 15 నుంచి ఈ రాశుల వారికి ఏం జరగనుందంటే..?
నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహంగా శని గ్రహాన్ని చెబుతూ ఉంటారు. శని ప్రభావం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని, శనిని అనుగ్రహించేందుకు ఆయనకు పూజలు చేయాలని పండితులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే శని గ్రహానికి నెమ్మదిగా ప్రయాణించే గ్రహంగా పేరుంది. ఏదైనా రాశిలో శనీశ్వరుడు ప్రవేశిస్తే సుమారు రెండున్నర ఏళ్లు ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. మళ్ళీ అదే రాశిలో రావాలంటే సుమారు 30 ఏళ్ల సమయం పడుతుందట.
అయితే కుంభ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు జూన్ 30వ తేదీ నుంచి ఆ రాశిలో తిరోగమనం వైపు ప్రయాణిస్తున్నారని పండితులు చెబుతున్నారు. అయితే నవంబర్ 15వ తేదీ తరువాత తన దిశను శని మార్చుకోనున్నాడని, కుంభరాశిలో శని నేరుగా అడుగుపెట్టి, సంచరించనున్నారని పేర్కొంటున్నారు. దీని కారణంగా పలు రాశుల వారికి అదృష్టం పట్టనుందని, మరికొన్ని రాశుల వారికి దురదృష్టం ప్రాప్తించనుందని తెలిపారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఏ రాశి వారికి శుభం కలుగుతుందంటే?
మేష రాశి: కుంభరాశిలో శనీశ్వరుడి ప్రత్యేక్ష సంచారం మేష రాశివారికి ఎంతో మేలు చేస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వృత్తి, వ్యాపార, రంగాలకు చెందిన వ్యక్తులు గొప్ప విజయాలు సాధిస్తారని తెలిపారు. వృత్తిలో వ్యక్తిగతంగా ఎదుగుదల ఉంటుందని, వ్యక్తిగత జీవితం, ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.
కన్య రాశి: శనీశ్వరుడి ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ రాశి వారికి నవంబర్ 15వ తేదీ తరువాత అద్భుత కాలం ఉండనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎంతోకాలంగా పూర్తవకుండా ఉండిపోయిన పనులు పూర్తవుతాయట. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబంలో పరస్పర విభేదాలు తొలిగి అన్యోన్యంగా ఉంటారు. దీంతో పాటు ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా బలంగా ఉంటారు.
మకర రాశి: కుంభ రాశిలో శనీశ్వరుడి ప్రత్యక్ష సంచారం మకర రాశి వారికి శుభకాలం. ఈ కాలంలో మకర రాశికి చెందిన వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ కాలంలో మకర రాశివారు ఆర్థికంగా, పెట్టుబడుల పరంగా వృద్ధి చెందుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆర్థికంగా పురోగతిని సాధించాలని అనుకునేవారు.. ప్రయోజనం పొందాలంటే కొంచెం అధికంగా కష్టపడాల్సి ఉంటుంది.
ఏ రాశి వారికి సమస్యలు పెరుగుతాయంటే?
కుంభ రాశిలో శనీశ్వరుడి ప్రత్యక్ష సంచారం వల్ల కొన్ని రాశుల వారికి సమస్యలు పెరగనున్నాయి. వృషభం, మిథునం, కర్కాటకం రాశి వారికీ సమస్యలు తీవ్రం కానున్నాయి. ఈ రాశుల వారికి ముఖ్యంగా ఆస్తి సమస్యలు పెరగనున్నాయి. అలాగే అత్త, మామల సంబంధాలపై ప్రభావం చూపనుంది. ఇతర సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశముంది. మానసిక, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతినే ఛాన్సుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications