Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఈ రెండు రాశుల వారికి శని 3 నెలలు నరకం చూపించబోతున్నాడు
నవగ్రహాలలోని ఇతర గ్రహాలలో అన్నిటితో పోలిస్తే శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాల కాలం తీసుకుంటారు. శని ఏ రాశిలో సంచరిస్తారో ఆ రాశితో పాటు రాశి చక్రంలోని ప్రతి రాశి ప్రభావితం అవుతుంది. కొందరికి శని సంచారం వల్ల అనుకూల ఫలితాలు రావచ్చు, కొంతమందికి దురదృష్ట ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉండొచ్చు.
ప్రస్తుతం శని దేవుడు పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. పూర్వాభాద్ర నక్షత్రం అనేది గురువుకు సంబంధించిన నక్షత్రం. ఏప్రిల్ 28 వరకు శని ఈ నక్షత్రంలో సంచరించనున్నారు. అయితే ఈ నక్షత్రంలో శని సంచారం.. కొన్ని రాశుల వారికి పెను ప్రమాదంగా మారుతుంది. వారికన్నీ దరదృష్ట ఫలితాలే వస్తాయి. ఆయా రాశుల వారు అనేక కష్టాలను అనుభవించే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

కుంభ రాశి
కుంభ రాశివారు ఏప్రిల్ 28 వరకు కొన్ని విషయాలపై దృష్టి సారిస్తే మంచిది. ఈ కాలంలో ఆర్ధిక వ్యవహారాలపై అదనపు శ్రద్ధ వహించాలి. మీరు సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఉపయోగించాలి, లేకుంటే అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. డబ్బు ఆదా చేయడానికి కొన్ని పొదుపు పథకాల్లో చేరడం మంచిది. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తపడటం మంచిది. బంధువులతో ఉండే కుటుంబ వివాదాలలో జోక్యం చేసుకోవడం మీకు సమస్యలను కలిగిస్తుంది.
ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ జీవితంలో చిన్న చిన్న విషయాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. మీకు విచారం, కోపం తెప్పించే విషయాలు తరచుగా జరుగుతుంటాయి. మీ పనిలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబంలో జరిగే కొన్ని విషయాలు మానసిక క్షోభను కలిగిస్తాయి. పిల్లలకు కొన్ని చెడు విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. భూముల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. మొత్తంగా శని ప్రభావం కారణంగా అన్నీ దురదృష్ట ఫలితాలే వచ్చే అవకాశాలు ఉంటాయి.
వృశ్చిక రాశి
శని సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు, పురోగతి ఆశించినంతగా ఉండకపోవచ్చు. భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉన్నందున కొత్త వెంచర్లకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే అది నష్టానికి దారి తీస్తుంది. కొత్త ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటారు.
ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక పురోగతిని సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంట్లోని సీనియర్ల మాటలు వినడం మంచిది. జీవితంలో మంచి జరగాలంటే ప్రతి పని ఓపికతో చేయాలి. మితిమీరిన కోపంతో చేసే పనులు తీవ్ర సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడమే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
