Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
2025లో ఈ మూడు రాశుల వారిని కోటీశ్వరులు చేసే బాధ్యత తమదేనంటున్న శుక్ర, శని
జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానికి అనుగుణంగా తమ గమనాలు, తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్లే క్రమంలో ఇతర గ్రహాలతో కలుస్తుంటాయి కూడా. ఇలా ఇతర గ్రహాలతో గ్రహాల కలయికను యుతి అని చెబుతుంటారు. అయితే ఈ డిసెంబర్ నెలలో శనీశ్వరుడు, శుక్రుడు కుంభరాశిలో కలుసుకోనున్నారు. ఈ రెండు గ్రహాలు చాలా శక్తివంతమైనది కావడం, వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో మొత్తం రాశులన్నీ ప్రభావితం కానున్నాయి.
అయితే మూడు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసిరానుంది. ఇంతకీ ఆ అదృష్టవంతమైన మూడు రాశులు ఏవి? వారికి ఏ విధంగా అదృష్టం కలిసిరానుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వృషభ రాశి:
సాధారణంగా శని, శుక్ర గ్రహాలను స్నేహపూర్వకంగా గ్రహాలుగా చెప్పుకుంటారు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక వలన.. 2024 సంవత్సరం చివరి వరకు వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే ఛాన్సుంది. చేపట్టబోయే ప్రతిపనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పురోగతితో పాటు భారీగా లాభాలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యల మద్దతు ఉంటుంది.
తులా రాశి:
శని, శుక్రుల యుతి కారణంగా ఈ రాశి వారికి కూడా చాలా అద్భుతమైన అదృష్ట ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి వారు ఈ గ్రహాలు కలిసి ఉన్నంత వరకు తమ జీవితంలో ఉన్న స్థానాలకు వెళ్తారు. విద్యార్థులు పరీక్షల్లో విజయవంతమై తీరుతారు. ఉద్యోగంలో గొప్ప స్థానానికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వారసత్వ ఆస్తులు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుండడంతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా ఉంటుంది.
కుంభ రాశి:
నిజానికి శని, శుక్ర గ్రహాల కలయిక కుంభ రాశిలో జరగనుంది. దీని కారణంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవనుంది. ఈ రాశి వారి జీవితం విలాసవంతంగా మారబోతుంది. ఉద్యోగ జీవితంలో వీరి ప్రాధాన్యత పెరగడంతో పాటు గొప్ప స్థానానికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. విలాసాలు, సుఖాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి కూడా చాలా బలంగా ఉండబోతుంది. పెళ్లి కానీ వ్యక్తులకు పెళ్లిళ్లు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇంతకీ ఈ గ్రహాలు ఎప్పుడు కలుస్తున్నాయంటే?
డిసెంబర్ నెలలో శని, శుక్ర గ్రహాల కలయిక జరగనుంది. జోతిష్య పంచాంగం ప్రకారం.. శనీశ్వరుడు, రాక్షస గురువు అయినటువంటి శుక్రుడు.. 2024 డిసెంబర్ 28వ తేదీన రాత్రి 11:48 గంటలకు కుంభ రాశిలోకి ప్రవేశిస్తారు. అక్కడే వీరిద్దరి కలయిక జరగనుంది. ఈ కలయిక సుమారు ఒక నెలపాటు కొనసాగనుంది. అంటే ఈ రెండు గ్రహాలు 2025 జనవరి 28 ఉదయం 7:12 గంటల వరకు కుంభరాశిలోనే ఉండనున్నారు. దీని కారణంగా పైన పేర్కొనబడిన రాశుల వారికి నెలరోజుల పాటు అదృష్టం తాండవం చేయనుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications