Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఈ రాశివారిపై దయ చూపిన శని.. శివరాత్రి నుంచి ఈ రాశుల శని దోషం పూర్తిగా తొలిపోతుంది!
ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న వచ్చే మహాశివరాత్రి జ్యోతిషశాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున, కొన్ని గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశులకు చెందిన వారు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉచ్ఛ శుక్రుడు, బుధుడు మీన రాశిలో, గురువు వృషభరాశిలో, రవి కుంభరాశిలో, శని కుంభరాశిలో సంచారం చేయడం వలన అనేక రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. కొన్ని రాశుల వారికి శని దోషాలు కూడా తొలిగిపోతాయి. శని వారి జీవితంలో వెలుగును ప్రకాశింపబోతున్నాడు. అయితే ఏ ఏ రాశుల వారు దీనితో లాభపడతారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
ఈ రాశివారికి గత రెండు సంవత్సరాలుగా అష్టమ శని దోషం సంతరించుకుంది. మార్చి 29తో ఈ దోషం పూర్తిగా తొలగిపోతుంది. మహాశివరాత్రి రోజున శివారాధన లేదా రుద్రాష్టకం పఠించడముతో ఈ దోషం తగ్గిపోతుంది. దీని కారణంగా ఈ రాశి వారు చేసే పనులు ఆటంకాల లేకుండా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో కష్టాలు తొలగిపోతాయి.

సింహ రాశి:
ఈ రాశికి సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల పెళ్లి సంబంధాలు ఆలస్యమవుతుంటాయి. శివరాత్రి రోజున శివుని పూజ చేయడం వల్ల పెళ్లి సంబంధాలు కుదరడం, ఉద్యోగంలో పురోగతి, ధన లాభం కలుగుతుంది. అనారోగ్యాలు తగ్గిపోతాయి. అలాగే డబ్బు పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్టాల ఊబిలో నుంచి కొంత మేర బయటపడొచ్చు.
వృశ్చిక రాశి:
ఈ రాశివారికి శని దోషం కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబంలో సుఖసంతోషాలు లేకపోవడం, నిరాశ ఏర్పడడం జరుగుతోంది. శివరాత్రి రోజున శివుడికి చిన్న పూజ చేస్తే, కుటుంబంలో సుఖం పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. డబ్బులు వస్తాయి. చేపట్టబోయే ప్రతి కార్యం విజయంవైపు మిమ్మల్ని నడిపిస్తుంది.
మకర రాశి:
ఈ రాశివారికి గత ఏడున్నర సంవత్సరాలుగా అనేక ఆర్థిక కష్టాలు ఉన్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం లేదా జాగరణ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న డబ్బులు వస్తాయి, బాకీలు తగ్గిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే శని దోషం పూర్తిగా తొలిగిపోయి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు లభిస్తాయి.
కుంభ రాశి:
ఈ రాశివారికి గత ఐదు సంవత్సరాలుగా కుటుంబంలో మరియు ఉద్యోగంలో కష్టాలు ఉన్నాయి. చేపట్టిన ప్రతి పని వైఫల్యమవుతుంది. అలాగే ప్రతి విషయంలోనూ నిరాశ ఎదురవుతుంది. అందుకే శివరాత్రి రోజున శివ పూజ చేయడం వలన ఈ రాశి వారిపై శని ప్రభావం తగ్గిపోతుంది. ఈ క్రమంలో, ఆదాయం పెరుగుతుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి.
మీన రాశి:
ఈ రాశివారికి గత రెండున్నర సంవత్సరాలుగా ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురవుతున్నాయి. అలాగే డబ్బులు చేతుల్లో నిలవడం లేదు. దీంతో పాటు అనేక కస్టాలు వచ్చి పడుతున్నాయి. అందుకే ఈ రాశి వారు శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో రుద్రాష్టకం చేయడం ద్వారా ఆర్థిక పురోగతి కలుగుతుంది. వారి వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి జరగటం ఖాయం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications