Latest Updates
-
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.!
శివుడికి ఈ పరిహారాలు చేస్తే.. విపరీతమైన డబ్బు వస్తుందట, ఆర్ధిక సమస్యలే ఉండవట!
మన హిందూ ధర్మంలో ప్రతి రోజు ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుంది. వారానికి ఒక్కో రోజు, ఒక్కో దేవతకు అంకితం చేయబడింది. ఈ నేపథ్యంలో సోమవారం త్రిమూర్తుల్లో లయకారుడైన పరమశివునికి, అలాగే చంద్రుడికి అంకింతం చేయబడినట్లు పరిగణించబడుతుంది. శివుడి అనుగ్రహం పొందాలన్నా.. జీవితంలో శాంతి, ఆర్ధిక సుభిక్ష, మానసిక స్థిరత్వం కలగాలన్నా భగవాన్ శివుడిని సోమవారం రోజు ఆరాదిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతుంటారు. అయితే శివుడికి అత్యంత ఇష్టమైన, పవిత్రమైన ఈ రోజు నాడు కొన్ని పవిత్రమైన పరిహారాలు చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే జీవితాన్ని సానుకూలంగా నడిపించగలుగుతారు. ఇంతకీ సోమవారం శివుడి అనుగ్రహం కోసం చేయాల్సిన ఆ పరిహారాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శివలింగానికి పాలతో అభిషేకం చేయడం..
పవిత్రంగా భావించే ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. పాలలో చక్కెర లేదా తేనె కలిపి అభిషేకం చేయడం వల్ల కుటుంబ సమస్యలు, ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. పంచామృతం (పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి)తో అభిషేకం చేయడం వల్ల శరీర శుద్ధి, ఆధ్యాత్మిక శుద్ధి రెండూ సమకూరుతాయి.

బిల్వపత్రాలతో శివార్చన
బిల్వ పత్రం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన పత్రి. మూడు ఆకులు కలిగిన ఈ దివ్యవృక్షం - శివుని తత్త్వానికి సూచకం. సోమవారం శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల కోరికలు నెరవేరుతాయని, ఆరోగ్యం మెరుగవుతుందని మరియు వ్యాపార, ఉద్యోగ సంబంధ సమస్యలు తొలగుతాయని నమ్ముతారు. అయితే బిల్వ పత్రాలపై కుట్టలు లేకుండా, "ఓం నమః శివాయ" అని మంత్రోచ్ఛారణతో సమర్పించాలి.
పాలు లేదా ఆహార దానం చేయండి
ఈ రోజు పేదలకు, ఆశ్రమాల వారికి పాలు లేదా ఆహారాన్ని దానం చేయడం చంద్రుని దోషాల్ని తొలగించడంలో ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది నవగ్రహ శాంతికి కూడా ఎంతో తోడ్పడుతుంది. ధర్మం చేసి తలచుకోకూడదు అనే భావనతో నిస్వార్థంగా చేసే దానం, శక్తివంతమైన కర్మ పరిహారంగా పని చేస్తుంది.
ఉపవాసం పాటించండి
శివుని ఆరాధనలో సోమవారం ఉపవాసం ఉండడం ఒక ముఖ్యమైన భాగం. ఇది శరీర శుద్ధికి, మనస్సు నియంత్రణకు ఉపయోగపడుతుంది. అలాగే కారం, ఉప్పు తక్కువగా తీసుకుంటూ ఉపవాసం పాటించడం వల్ల ఆధ్యాత్మికంగా శుద్ధి పొందినట్టవుతుంది. ఉదయం శివ పూజ చేసి, సాయంత్రం ప్రదోషకాలంలో శివాస్టకం లేదా లింగాష్టకం పారాయణం చేయాలి.
శివధ్యానం, మంత్రజపం
చంద్రుడు మనస్సుని ప్రభావితం చేసే గ్రహంగా జ్యోతిష్యంలో భావించబడుతుంది. సోమవారం శివునికి "ఓం నమః శివాయ" మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది మనలో ధైర్యాన్ని, స్థిరత్వాన్ని పెంచుతుంది. అలాగే శివుడికి దీపం సమర్పించి శాంతికరమైన శివ తాండవం లేదా శివ స్తోత్రాలు వినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.
మరికొన్ని సులభమైన సోమవారం పరిహారాలు
ఇంట్లో శివపార్వతుల చిత్రాన్ని ప్రతిష్టించి, ప్రతి సోమవారం పూలతో అలంకరించండి.
నల్ల గోధుమలు లేదా నల్ల తులసి మొక్కలు నాటడం వల్ల స్థిరత, సంపద లభిస్తాయి.
శుభ్రత ఉన్న వాతావరణంలో పూజ చేస్తే శక్తివంతమైన ఫలితాలు కనిపిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
