Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Surya Grahan 2023: గ్రహణం వేళ ఆలయాలు ఎందుకు మూసేస్తారు? కారణాలేంటో తెలుసా?
సూర్య, చంద్ర గ్రహణాల చుట్టూ అనేక విశ్వాసాలు, నమ్మకాలు ఉన్నాయి. పురాణాలు, ఇతిహాసాల్లోనూ గ్రహణాల గురించి చెప్పారు. కేవలం హిందూ సాంప్రదాయంలోనే కాకుండా చాలా సంస్కృతుల్లో గ్రహణాల గురించి చెప్పారు. గ్రహణం రోజు కొన్ని పనులు చేయకూడదని, ఏమీ తినకూడదని, గర్భిణీలు ఇంటి నుండి బయటకు రావొద్దని అంటారు.
అలాగే సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో దేశంలోని ఆలయాలన్నీ మూసేస్తారు. అసలు గ్రహణాల వేళ ఆలయాల తలుపులు ఎందుకు మూసేస్తారు, తలుపులు మూసేసి లోపల ఏం చేస్తారు వీటి వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని రాహువు మింగేసినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అలాగే చంద్రుడిని కేతువు మింగేసినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణాలు ఏర్పడ సమయంలో సూతక్ కాలం ఉంటుంది. ఈ కాలాన్ని చెడుగా, అశుభంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎలాంటి పనులు మొదలుపెట్టరు.
ఆలయాల తలుపు ఎందుకు మూసేస్తారు?
ఆలయాల్లో దైవ యంత్రాలు ఉంచడం వల్ల వాతావరణంలోకి సానుకూల శక్తి విడుదల అవుతుంది. ఆలయంలో లోపల చేసే పూజలు, పఠించే మంత్రాలు, లయబద్ధంగా మోగించే గంటల శబ్ధాలు అన్నింటి వల్ల ఆ యంత్రాలు సానుకూల శక్తిని విడుదల చేస్తాయి. అందుకే గుడిలోకి వెళ్లినప్పుడు మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది.
గ్రహణం వేళ సూర్య, చంద్రుల నుండి ప్రతికూల శక్తి విడుదల అవుతుంది. ఇది ఆలయంలోకి వెళ్లినప్పుడు సానుకూల శక్తిని ప్రభావితం చేస్తుంది. అలాగే గ్రహణ సమయంలో దేవతల శక్తి కొంత మేర క్షీణిస్తుందని అని కూడా అంటారు. సూతక్ సమయంలో కూడా మంచి పనులు ప్రారంభించకపోవడానికి ఇదే కారణం.
గ్రహణాల ద్వారా ఏర్పడే ప్రతికూల శక్తి ఆలయంలోకి ప్రవేశించకూడదని ఆలయాల తలుపులు మూసేస్తారు. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ గుడి బయటే ఉండిపోతుంది. గ్రహణం పూర్తయిన తర్వాత గుడి పరిసరాల్లోకి చేరుకున్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాతే పూజలు చేయడం ప్రారంభిస్తారు.
ఆలయాల తలుపులు మూసేసి ఇలా చేస్తారు:
గ్రహణాల సమయంలో ఆలయాల తలుపులు మూసేస్తారు. తులసి దళాలను దేవుళ్ల విగ్రహాలపై, ప్రతిమలపై, యంత్రాలపై ఉంచుతారు. ప్రతికూల శక్తి తులసి రక్షిస్తుంది. గ్రహణం తర్వాత తులసి తీసివేసి ఆలయాన్ని శుభ్రం చేసి తిరిగి పూజలు ప్రారంభిస్తారు.

ఈ ఒక్క ఆలయం తప్ప అన్నింటిని మూసేస్తారు:
గ్రహణం సమయంలో దేశంలోని అన్ని ఆలయాలను మూసేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం మూసివేయకుండా ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.
శ్రీకాళహస్తిలో వెలసిన వాయులింగేశ్వరుడిని సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు. వాయులింగేశ్వరుడు సూర్య, చంద్రులు, అగ్నిభట్టారడితో పాటు తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లే ఈ క్షేత్రంపై రాహు, కేతువుల ప్రభావం చూపలేరని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీకాళహస్తీలో రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి. రాహు, కేతు దోషాలు ఉన్న వారు ఇక్కడ పూజలు చేయించుకుంటారు. సూర్య గ్రహణ ప్రారంభ సమయంలో శ్రీకాళహస్తీశ్వరుడికి శాంతి అభిషేకం నిర్వహిస్తారు. చంద్ర గ్రహణం అయితే విడుప సమయంలో శాంతి అభిషేకాన్ని నిర్వహిస్తారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











