సెప్టెంబర్‌ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.!

సెప్టెంబర్ 17న, సూర్యుడు సింహరాశిని విడిచి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. నెలరోజుల పాటు అక్కడే ఉండనున్నాడు. అప్పటివరకూ కేతువు ప్రభావంతో కొన్ని రాశుల వారు ఒడుదొడుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 17 తర్వాత ఈ పరిణామంతో సూర్యుడు కేతువు ప్రభావం నుంచి విముక్తి పొందనున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల కింద జన్మించిన వారికి వృత్తి, వ్యాపారం రంగాల్లో పురోగతితో పాటు చేతినిండా డబ్బును తీసుకురానుంది. ఈ రెండు రాశుల వారిలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న వారికి, వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి, ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి సానుకూలంగా ఉండనుంది.

The Sun enters Virgo on September 17 these zodiac signs people get luck

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆత్మవిశ్వాసం, లీడర్‌షిప్‌, హోదా, వృత్తికి కారకుడిగా సూర్యభగవానుడిని భావిస్తారు. ఈ క్రమంలో సూర్య సంచారం జరిగిన ప్రతిసారి దాని ప్రభావం మన జీవితాలపై పడుతుంది. కాగా, ఈ సెప్టెంబర్‌ 17న సూర్యుడు తన సొంత రాశి సింహం నుంచి కన్యారాశిలోకి ఉదయం 7.58 గంటలకు ప్రవేశించినున్నాడు. మళ్లీ అక్టోబర్‌ 17 రాత్రి 7.57 గంటలకు నిష్క్రమించనున్నాడు. సింహ రాశిలో ఉన్నంత కాలం కొన్ని రాశుల వారి ఒడుదొడుకులు ఎదురుకాగా.. ఈనెల 17 నుంచి నెల రోజుల పాటు కొన్ని రాశుల వారి దశ తిరగనుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటే చూద్దాం..

రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్‌ 24 వరకు వెంటాడనున్న దురదృష్టంరాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్‌ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం

వృశ్చిక రాశి

కన్యారాశిలోకి సూర్య సంచారం వృశ్చిక రాశి ఎనలేని అదృష్టాన్ని, లాభాలను తీసుకువస్తుంది. పదకొండో స్థానంలోకి ప్రవేశిస్తుండటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆదాయంతో పాటు లాభాలు మెండుగా ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి తమ ప్రయత్నాలకు ఫలితాలు దక్కనున్నాయి. నూతన పరిచయాలతో లాభాలు పెరిగే అవకాశం ఉంది. సొంతం వ్యాపారం ప్రారంభించాలనుకునేవారి ఆలోచనలు, ప్రణాళికలు ఓ కొలిక్కి రానున్నాయి. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. సంపాదన పెరుగుతుంది. ప్రమోషన్లు, కొత్త మార్గాలు అందుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది.

The Sun enters Virgo on September 17 these zodiac signs people get luck

ధనుస్సు రాశి

దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.!దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.!

ధనుస్సు రాశి వారి సూర్య సంచారం దశమ స్థానంలో జరగడం వల్ల ముఖ్యంగా వీరికి వృత్తిపరంగా వీరు ఎనలేని కీర్తిని సంపాదిస్తారు. ఉద్యోగులు తమ కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. ఆఫీసులో మీ పనికి, కష్టానికి గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. చాలా కాలంగా ప్రమోషన్‌ కోసం చూస్తున్న వారికి ఈ సమయం ఆ కోరిక నెరవేర్చవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నవారికి ఈ నెల రోజులు అనుకూలంగా ఉంటాయి. విజయం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగం మారాలని చూస్తున్నవారు కొత్త అవకాశాలు అందుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Sunday, September 13, 2026, 6:46 [IST]
Desktop Bottom Promotion