Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
కన్యా రాశి వారికి గండం.. కానీ దైవ బలం అండగా వుంటుంది.. ఎప్పుడంటే..?
కన్యా రాశి వారికి మంచి సమయం రాబోతోంది అలాగే వీరికి ఒక గండం కూడా వుంది. కన్యా రాశి వారికి దైవబలం అండ ఎక్కువగా వుండడం వల్ల వీరు త్వరగా బయటపడతారు. కన్యా రాశి వారు జన్మత: నైతిక విలువలను కలిగి వుంటారు. చాలా ఆదర్శంగా వుంటారు. ఈ రాశి వారికి శరీరం దృఢంగా వుంటుంది. ఈ రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే స్వభావం వుంటుంది. ఏపనినైనా ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. ప్రతీ పనిలో విజయం సాధించడానికి తమ వంతు కృషి చేస్తారు.

కన్యారాశి వారికి దైవబలం అండగా వుంది. దీంతో వీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించనున్నారు. ఈ రాశివారు జీవితంలో ముందుకు వెళ్లాలి, బాగా సంపాదించాలి అనే మనస్తత్వంతో వుంటారు. పనిని చక్కగా చేయడం వల్ల దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి మంచి సమయం రాబోతోంది. వృత్తిపరంగా ఎక్కువ డబ్బులను సంపాదించబోతున్నారు. వ్యాపారంలో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు పోవడం వల్ల తప్పకుండా లాభాలను ఎదుర్కొంటారు. ఆర్థికపరమైన స్థిరత్వాన్ని పొందుతారు. ప్రతీ పనిలో కూడా వీరికి అభివృద్ధి వుంటుంది.
ఆర్థికపరంగా, కుటుంబం పరంగా ఈ రాశివారికి మంచి సమయం రాబోతోంది. ఈ రాశివారు వేరే ఉద్యోగానికి మారాలనుకుంటే కొంత సమయం వరకు వేచి చూడ్డం మంచిది. ఉద్యోగపరమైన మార్పుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాలి. వ్యాపారంలో ముందుకు తీసుకెళ్లే విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు. అయితే లాభం రావాలనే ఆలోచనతో వీరు వ్యాపార ప్రయత్నాలను చేయాలి.

ఈ రాశి వారు మరొకరికి ఉద్యోగాల్ని కల్పించే వ్యాపారం చేయడం వల్ల మంచి లాభాన్ని పొందుతారు. ఈ రాశివారికి ఈ సమయం కొంత అనుకూలంగా వున్నప్పటికీ వీరికి తెలియకుండానే వీరి చుట్టూ శత్రువులు తయారౌతారు. కొన్ని సార్లు శతృవుల వల్ల ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశివారిలో కొందరికి ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు.
ఈ రాశివారు సమస్యలను ఎదుర్కొని ముందుకు పోవాలంటే ఒక పరిహారాన్ని పాటించాల్సిన అవసరముంది. ప్రతీ బుధవారం వినాయకుడు పూజచేసి నైవేద్యం సమర్పించడం, లేని వారికి ఐదుగురికి వస్త్రాలను దానం చేయడం ద్వారా ఈ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశివారు కుటుంబ పరంగా కొన్ని మనస్పర్ధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలను ఎదుర్కోవాలంటే ప్రతీ గురువారం దత్తాత్రేయుడి గుడికి వెళ్లి దత్తాత్రేయుడిని దర్శించుకోవాలి. ఈ రాశివారు కుటుంబంలోని వ్యక్తులకు కొంత సమయాన్ని కేటాయించాలి. వారి అభిప్రాయాలను గౌరవిస్తూ వారితో సున్నితంగా మెలగడం వల్ల పరస్పర మనస్ఫర్ధలు తొలగిపోతాయ్.
కన్యారాశి వారికి ప్రేమ వివాహం కలిసిరాదు. ఎదుటివారికి అర్థం చేసుకోవడంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. సాధ్యమైనంతవరకు ప్రేమ వ్యవహారాలకు ఈ రాశివారు దూరంగా వుండడం మంచిది. ఈ రాశివారికి కొంచెం కోపం ఎక్కువగా వుంటుంది. ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి తెలియకుండానే పెద్ద ప్రమాదం పొంచి వుంది. దీన్నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలను పాటించాలి. ఈ రాశివారికి అపజయం అనేది వుండదు. వీరికి వున్న అన్ని సమస్యలు తొలగిపోతాయ్. ఏవైనా అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అగ్రిమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. ఏదైనా ఒక అమావాస్య రోజున బ్రాహ్మణులకు వస్త్రాలను దానం చేయాలి. శుక్రవారం రోజు అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించండి. ఈ పరిహారాలను పాటించడం వల్ల వీరికి వున్న పెద్ద గండం నుంచి సులభంగా బయటపడతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
