Latest Updates
-
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు
జూన్‌లో ఈ 7 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. విజయం మీ వెంటే.!
జూన్ మాసం ఎన్నో కీలకమైన మార్పులకు వేదిక కాబోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వారి జాతక రీత్యా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలతో రాజయోగం పట్టబోతుంటే.. మరికొన్ని రాశుల వారికి అడుగడుగా సవాళ్లు విసురుతోంది. మేషం నుంచి మీనం వరకు రాశుల వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో జూన్ ఎలాంటి పరిణామాలు తీసుకువస్తుందో ఇక్కడ చూద్దాం.

మేష రాశి
జూన్ నెలలో మేష రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో పాటు ఆశయాలు నెరవేరుతాయి. అయితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కానీ ఆరంభంలో ఎదురయ్యే పని ఒత్తిడి, వృత్తిపరమైన చికాకులను కుటుంబీకులపై రుద్దడం ప్రారంభిస్తారు. దీంతో ఇంట్లో వారితో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కోపం, అసహనం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి
వృషభ రాశి వారు ఈ నెలలో మహర్దశ కారణంగా సుఖశాంతులతో ఉంటారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అంతా శుభమే జరుగుతుంది. భారీ ఆర్థిక సమస్యల బారి నుంచి బయటపడతారు. ఆదాయంలో సంతృప్తికరమైన పెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితం దక్కుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీ ఆదాయానికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం శ్రేయస్కరం.
మిథున రాశి
మిథున రాశి వారికి జూన్ నెల సవాళ్లతో నిండి ఉంటుంది. ఇంటా బయటా శత్రువుల నుంచి ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. శత్రువులు మిమ్మల్ని ఓడించి పై చేయి సాధించేందుకు యత్నిస్తారు. అందుకే చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగేయడం మంచిది. అంతే కాకుండా ఈ నెలలో ఎదురయ్యే అనవసర ఖర్చులతో మానసిక ఒత్తిడి పెరిగి ప్రశాంతతను కోల్పోతారు. కుటుంబ బంధాల విషయంలోనూ సహనం ప్రదర్శించడం ఉత్తమం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ నెలలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ప్రతిభకి తగిన గుర్తింపు, విదేశీయానాలు, లక్ష్మీ దేవి కటాక్షం, కుటుంబీకుల మద్దతు పుష్కలంగా అందుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే సూచనలు ఉన్నాయి. ఈ రాశుల వారు విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవిని ఆరాధించడం శ్రేయస్కరం.
సింహ రాశి
సింహ రాశి వారికి జూన్ నెలంతా ఓ ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఒక విషయంలో సంతోషాన్ని అందుకున్నా.. మరో విషయంలో బాధపడక తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఆరంభంలో కష్టాలు ఎదురైనా తర్వాత సత్ఫలితాలను అందుకుంటారు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉద్యోగం, లేదా వ్యాపారంలో మీరు అనుకున్నది సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది. అక్కడే డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. చివరికి విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం కుదురుగా ఉంటుంది.
కన్య రాశి
కన్య రాశి వారి జూన్ నెల అత్యంత సంతోషంగా గడుస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవడమే కాకుండా నెల మధ్యలో శుభ వార్త వింటారు. సిరిసంపదలు వచ్చి చేరడంతో ఆర్థికంగా ఢోకా ఉండదు. దైవారాధన, పూజల్లో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపుతో బతుకుతారు.
తులా రాశి
తులా రాశి వారికి జూన్ సవాళ్లతో నిండి ఉంటుంది. కోపాన్ని, సహనాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే సమస్యలు తప్పవు. ఆరోగ్యం కూడా అప్పుడప్పుడూ ప్రతికూలంగా మారుతుంది. శత్రువుల వల్ల ఇబ్బంది ఏర్పడినా.. జీవిత భాగస్వామి మద్దతు కారణంగా సవాళ్లను ఎదుర్కొంటారు. యువతీయువకులకకు ప్రేమ వ్యవహారాల్లో మనస్పర్థలు తలెత్తుతాయి. వ్యాపారంలో భారీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈ నెలలో నిశ్చింతగా ఉండచ్చు. ఇంట్లో శుభకార్యాలు మొదలుకుని, వృత్తిపరంగా పురోగతితో సంతోషంగా ఉంటారు. సౌకర్యాలు పెరిగి విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. వ్యాపారంలో పరిచయాలు పెరుగుతాయి. అయితే రిస్క్ ఉన్న వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి జూన్ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పరీక్షలు పెడుతుంది. పనుల్లో ఆటంకాలతో పాటు ఆదాయం తగ్గి ఖర్చులు పెరగడంతో చిరాకు పెరిగి మనశ్సాంతిని దూరం చేస్తుంది. ఆదాయం తగ్గి ఖర్చులు పెరగడం వల్ల ఆందోళన చెందుతారు. వ్యాపార నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.
మకర రాశి
మకర రాశి వారు ఈ నెలలో శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు, వ్యాపారస్థులకు.. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయాన్ని ఆర్జించే మార్గం పెరిగి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ బంధాలు మెరుగ్గా ఉంటాయి.
కుంభ రాశి
కుంభ రాశికి జూన్ మాసం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. వృత్తి నిర్వహణలో భాగంగా నిర్లక్ష్యం వహించకూడదు. మీ పై అధికారులతో వాదనలు మంచిది కాదు. ఆర్థికంగా పెద్దగా మార్పులు లేకపోయినా కుటుంబ బంధాలు కాపాడుకోవడంలో కష్టాలు తప్పువు. వ్యాపరస్థులకు అంతా సానుకూలంగా ఉంటుంది. ప్రయాణ సూచనలు ఉన్నాయి.
మీన రాశి
జూన్ నెలలో మీన రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో, భూములు, బంగారంపై పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైన సమయం. మంచి లాభాలను పొందవచ్చు. కుటుంబంలో సమస్యలు ఏవైనా పరిష్కరించుకుంటారు. ఈ నెలలో కుటుంబంలో శుభవార్త వింటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications