Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
2025లో ఈ 3 రాశుల వారికి అన్నీ దరిద్రాలే.. ఈ పనులే వీళ్ళను రక్షిస్తాయి.. అవేంటంటే?
జోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాలన్నీ క్రమంగా గమనం చేస్తూ ఉంటాయి. తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అలాగే ఒక నిర్దిష్ట కాలంలో తమ రాశిని కూడా మార్చుకుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తుంటాయి. అయితే గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ 7వ తేదీ నుంచి వక్రీస్తూ ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఈ రాశిలోనే సంచరించనున్నాడు. దీనికారణంగా పలు రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఆత్మ విశ్వాసం లోపిస్తుంది. చేపట్టే పనులన్నీ విఫలం అవుతుంటాయి. డబ్బులు భారీగా కోల్పోతారు. కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ధైర్యానికి, బలానికి, శౌర్యానికి కారకుడైన కుజుడు వక్రంగా మారడం వల్ల 3 రాశుల వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఆ మూడు రాశులు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వృషభం
కుజుడు ఈ వృషభ రాశిలో మూడో స్థానంలో వక్రంగా సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తుల మనసులో ప్రతికూల ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన అనేక సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. కుజుడు వక్రంగా ప్రయాణించడం వల్ల వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో అనేక గొడవలు వస్తాయి. భాగస్వామితో తరచూ వాదనలు జరిగే ఛాన్సుంది. కుటుంబంలో కలహాలు నెలకొంటాయి.
ఉద్యోగస్తులకు తమ తమ ఉద్యోగ కార్యాలయంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా పదోన్నతి లభించకుండాపోయే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. లాభాలను కూడా కోల్పోనున్నట్లు తెలుస్తోంది.
కర్కాటకం
కుజుడు కర్కాటక రాశిలో ఒకటవ స్థానంలో వక్రంగా, తిరోగమనంలో సంచరిస్తూ ఉంటాడు. ఇది ఈ రాశి వారికి ఏమాత్రం మంచిది కాదు. వ్యాపారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కూడా తమ ఉద్యోగంలో తీవ్ర సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఉద్యోగులు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. దంపతులిద్దరూ వాదనలకు దిగే అవకాశం ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. దీని కారణంగా డబ్బు సమస్యను ఎదుర్కొంటారు.
మీనరాశి
గ్రహాలకు అధిపతి అయిన కుజుడు మీనరాశిలో అయిదవ స్థానంలో తిరోగమనంలో, వక్రంగా ప్రయాణిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు ముఖ్యంగా ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటారు. ఆస్తి, ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఏమాత్రం మంచి సమయం కాదు. ఆస్తి సంబంధిత విషయాలపై కోర్టులకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంట్లో చేడు వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో కలహాలు నెలకొంటాయి.
ఆస్తి సంబంధింత విషయాల కారణంగా కోర్టులకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఓపిక చాలా ముఖ్యం. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇలా తొందరపాటు తనం వల్ల కచ్చితంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు చాలా సంయమనంతో వ్యవహరించాలి.
గమనిక: ఈ కథనంలోని సమాచారం, జోతిష్య వివరణలు కేవలం మీకు జ్ఞానం అందించేందుకు మాత్రమే అందించబడింది. ఈ కథనం ఆధారంగా మీకు ఎలాంటి నష్టాలైన కలిగిస్తే వాటికి బోల్డ్ స్కై బాధ్యత వహించదు. ఈ సమాచారం ఆధారంగా మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు కచ్చితంగా గుర్తింపుపొందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని Boldsky.com మీకు సూచిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications