Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
డిసెంబర్ 15వ తేదీ వరకు ఈ 6 రాశుల వారికి అన్నీ కష్టాలే.. ఈ ఒక్క పని చేయకపోతే ఇక అంతే!
బుధుడు ఈనెల 26వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు వక్రీస్తూ ప్రయాణించనున్నాడు. దీని కారణంగా పలు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పటికీ మరికొన్ని రాశుల వారికి చాలా కష్టాలు, నష్టాలు ఉండనున్నాయి. వ్యాపారాలు, అకౌంట్స్, తెలివితేటలు, సమయస్ఫూర్తి, బ్యాంక్ బ్యాలన్స్ వంటి అంశాలను బుధుడు తీవ్రంగా ప్రభావితం చేస్తాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఆర్ధిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రాశులు ఏంటి? ఏ రాశుల వారికి కష్టనష్టాలు ఉంటాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.
మేషం:
ఈ రాశి వారికి ఎనిమిదో స్థానంలో బుధుడు వక్రీస్తున్నాడు. దీనికారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు కొన్ని సమస్యలు, వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. తొందరపడి ఏ విషయంలోనూ నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఎలాంటి వాటిపైనా కూడా సంతకాలు చేయకూడదు. ఏదైనా విషయమై ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఉద్యోగ జీవితంలో కొన్ని పొరపాట్లు చోటు చేసుకొని, అవి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. ఆర్ధిక లావాదేవీలను పెట్టుకోకపోవడమే మంచిది. వాదనలకు దూరంగా ఉంటే మీకు మనశ్శాంతి లభిస్తుంది.

కర్కాటక:
ఈ రాశి వారికి పంచమ స్థానంలో బుధుడు వక్రీస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు కొన్ని తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలతో పాటు ఉద్యోగంలో కూడా కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటారు. బంధువులు మీ పేరు ప్రతిష్టతలకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కలహాలు వచ్చేస్తాయి. మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులే ముఖం చాటేసే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో భారీగా నష్టపోవడంతో పాటు లాభాలను చూడరు కూడా.
సింహ:
ఈ రాశి వారికి నాలుగో స్థానంలో బుధుడు వక్రిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి సుఖ సంతోషాలు లోపిస్తాయి. కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అలాగే తీవ్రమైన ఒత్తిడితో కుంగిపోతారు. గృహ నిర్మాణాలు, ఆస్తి సంబంధిత విషయాల్లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టె అవకాశం ఉండడంతో పాటు.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పెను సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. కొందరు బంధు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అందుకే డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం అనేది చేయకూడదు.
వృశ్చికం:
ఈ రాశిలో బుధుడికి వక్రగతి పడుతుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు వ్యక్తిగత సమస్యలు తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఏ రంగంలో వారికైనా శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కే అవకాశం కనిపించడం లేదు. దాంపత్య జీవితంలో పలు సమస్యలు ఎదురయ్యే ఛాన్సుంది. వ్యాపారాల్లో పోటీదారుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆదాయ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.
ధనుస్సు:
ఈ రాశి వారికి 12వ స్థానంలో బుధుడు వక్రిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తుల కష్టార్జితం వృథాగా మారిపోతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా అది విఫలయత్నంగానే మారిపోతుంది. రావాల్సిన డబ్బులు రాకపోవడంతో తీవ్రమైన ఆర్ధిక అనిశ్చితిని ఎదుర్కొంటారు. వైద్య ఖర్చులు సైతం పెరిగే అవకాశం ఉంది. బంధువుల్లో కొందరు శత్రువులుగా మారి మీకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. దూర ప్రయాణాల్లో లాభాలకంటే నష్టాలే ఎక్కువగా చవిచూడనున్నారు. వృత్తి, వ్యాపారాలు మందకొండిగా కొనసాగుతాయి.
మీనం:
ఈ రాశి వారికి భాగ్య స్థానంలో బుధుడు వక్రిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తుల శుభకార్యాలకు అడ్డంకులు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వ్యక్తుల ప్రయత్నాలు నిలిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లలకు, పెద్దలకు కమ్యూనికేషన్ ఆటంకం ఏర్పడనుంది. రావాల్సిన డబ్బులు చేతికి రాకపోవడం, సాయం చేసిన స్నేహితులే ముఖం చాటేయడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత తగ్గి, సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
