Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
నవంబర్ నెలలో శని సంచారం.. ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేకపోతే!
నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన, కఠినమైన ఫలితాలు ఇచ్చే గ్రహం శని గ్రహం. జీవితంలో శని ప్రభావం కారణంగా పేదవారు ధనవంతులు అవుతారు, ధనవంతులు ఏమీ లేని స్థితికి వచ్చేస్తారు. అందుకే జీవితంలో శని సంచారం కారణంగా ఎంతమంది సంతోషిస్తారో అంతకంటే ఎక్కువ మంది భయపడతారు. శని గ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకోలేరు కూడా. కానీ కొన్ని పరిహారాలతో శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
అయితే కుంభరాశిలో సంచరిస్తున్న శనీశ్వరుడు, ఈ నెలలో తిరోగమనంలో సంచారం మొదలుపెట్టనున్నారు. దీని కారణంగా పలు రాశుల వారికి చాలా కఠినమైన ఫలితాలు దక్కనున్నాయి. ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రాశులు ఏంటి? ఎలాంటి ఫలాలు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

మీనం
మీన రాశిలో శనీశ్వరుడు అత్యంత కఠినమైన స్థితిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మీనరాశి వారు శని సంచారం సమయంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఆర్ధిక వ్యవహారాలు కూడా ఇబ్బందిగా మారుతాయి. దీని కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా కీలకమైన సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం కఠినతరమవుతుంది.
ఈ ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం పొందడానికి, శని ప్రభావం నుంచి కాస్త తప్పించుకోవడానికి కొన్ని పరిహారపు మంత్రాలు, కార్యక్రమాలు చేస్తే ఫలితం పొందొచ్చు. అవి ఏంటంటే.. ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయాన్ని సందర్శించడం, పేద వారికి నల్ల నువ్వులతో పాటు ఆహార పదార్థాలను దానం చేయడం, నల్ల తివాచి పెట్టడం, శనివారం శనికి రుద్రాభిషేకం చేయడం, ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు.
కుంభ రాశి
ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. అయితే ఈ రాశిలో ఈ నెలలో శని తిరోగమన సంచారం చేయనున్నాడు. దీని కారణంగా కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్ధిక వ్యవహారాలు బాగున్నా, ఉద్యోగ జీవితం బాగున్నా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో కొన్ని సమస్యలను తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వ్యక్తిగత జీవితంలోని కొన్ని సమస్యలు వృత్తి జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కుటుంబంలో సమస్యలు ఎదురయ్యే ఛాన్సుంది. కుటుంబ సభ్యుల పట్ల కోపాన్ని ప్రదర్శించకుండా ప్రేమగా మెలగాలి. వైవాహిక జీవితంలో కొంత అసమ్మతి ఉండే సూచనలు గోచరిస్తున్నాయి. అవి పెరగకుండా జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
అనవసర వాదనలు పక్కన పెట్టి, మంచి మనసుతో మెలగాలి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించాలి. ప్రతి మంగళవారం, శనివారం హనుమంతుడిని పూజించి, శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి నువ్వుల నూనె దానం చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు.
మకరరాశి
శని తిరోగమన సంచారం కారణంగా మకర రాశి వ్యక్తులు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితులు పక్కనపెట్టినప్పటికీ కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. వైవాహిక జీవితంలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ఛాన్సుంది. భార్య, భర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తాయి. మూడో వ్యక్తి ప్రభావంతో దాంపత్య జీవితం మూడు ముక్కలయ్యే ఛాన్సుంది.
ఈ శని సంచార ప్రభావం పోయే వరకు.. దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే ఎలాంటి కోపాలకు, ఒత్తిడికి గురి కావొద్దు. మూడో వ్యక్తి అభిప్రాయాన్ని ఏ మాత్రం తీసుకోకూడదు. ఆర్ధిక వ్యవహారాలపై శ్రద్ధ తీసుకోవాలి. మీరు కోరుకున్న విధంగా డబ్బులు సమకూరే అవకాశాలు కనిపించడం లేదు. తద్వారా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయొద్దు.
మకర రాశి వారికి శని ప్రభావం చివరి దశలో ఉంది. అందుకే త్వరలోనే ఈ సమస్యలు తొలిగిపోయి ఛాన్సుంది. అయినప్పటికీ కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా మంత్రాన్ని జపించడం ద్వారా శని ప్రభావం ఉంచి ఉపశమనం పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications