Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
ఈ రాశి వారు పెళ్లి సులభంగా చేసుకోరు..! పెళ్లికాకపోతే ఇందులో మీ రాశి వుండొచ్చు..!
వివాహం చేసుకోవడం ఇష్టపూర్వకంగా జరగాలి కానీ, శారీరకంగా, మానసికంగా హింసించి చేసుకోకూడదు. ఒకవేల అలాంటి వివాహాలు జరిగినా దినదిన గండం నూరేళ్ల ఆయుశ్శులా సాగుతుంది. ఆదర్శంగా వుండాల్సిన దంపతుల కుటుంబాల్లో బూతద్దం పెట్టి వెతికినా సంతోషం అస్సలు కనబడదు. ఈ రాశులకు చెందిన వారు పెళ్లంటేనే వెనకడుగు వేస్తుంటారు. పెళ్లి చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి వుండాలని అనుకుంటారు. అలా లేని పక్షంలో తీవ్రంగా కలత చెండదం జరుగుతుంది. ఆ రాశులు ఏవో ఒకసారి తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి వారు కుటుంబ సభ్యుల మీద అధిక ప్రేమను కలిగివుంటారు. వీరు జీవితంలో ఎక్కువగా విలువలకు కట్టుబడి వుంటారు. వీరి ప్రతీ ఆలోచనలోనూ కుటుంబ శ్రేయస్సు వుంటుంది. వివాహం చేసుకున్న తరువాత తన భాగస్వామి ఇంటికి, కుటుంబ సభ్యులకు విలువ ఇస్తుందో లేదనని బాధపడుతుంటారు. ఎంతగానైతే ప్రామిస్తారో అంతే ప్రేమను తిరిగి పొందాలని భావిస్తారు. వెంటనే వివాహానికి సుముఖతను వ్యక్తం చేయలేరు. మానసికంగా సంతృప్తి కలిగించే వ్యక్తులను భాగస్వాములుగా కావాలని కోరుకుంటారు. తమ వృత్తి ఆలోచనలకు అనుగుణంగా భాగస్వామి కలిగివుండాని కోరుకుంటారు.
మిధున రాశి
మిధున రాశివారు కొత్త వ్యక్తులతో కలిసి వుండటాన్ని ద్వేశిస్తూ వుంటారు. తమకు నచ్చిన, తమకు అన్ని విధాలుగా తెలిసిన వారిని మాత్రమే వివాహం చేసుకోవాలని అనుకుంటారు. తమకు నచ్చని వ్యక్తుల పట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగి వుంటారు. ఇష్టం లేని వివాహానికి ప్రోత్సహిస్తే వీరి చర్యలు వర్ణనాతీతంగా వుంటాయ్. కుటుంబం మొత్తం ఒకే చేతిమీద వుండాలి. మిగిలిన వారు తోడ్పాటును అందివ్వాలని వీరి ఉద్దేశ్యం. కుటుంబ పరిస్థితులను నిలబట్టే భాగస్వామి దొరికితే వీరి ఆనందానికి హద్దే వుండదు. తమ అనుకున్న వారిమీదే కోపతాపాలను కలిగి వుంటారు. వీరిని వివాహానికి ఒప్పించడం మాత్రం అంత సులువైన విషయం కాదు.

తులా రాశి
తులా రాశి వారు ఎక్కువగా కుటుంబ సభ్యులకు బంధాలకు విలువ ఇస్తుంటారు. తాము చేసుకోబోయే వ్యక్తులు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా అందరినీ సమానంగా చూస్తూ బంధాలకూ, బాంధవ్యాలకూ విలువ ఇవ్వాలనే ఆలోచనను కలిగి వుంటారు. ఎటువంటి సమస్య ఎదురైనా ఒంటరిగా పోరాడాలనే తత్వాన్ని కలిగిన ఈ తులా రాశి వారు తమ భావోద్వేగాలను అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామి కావాలని కలలు కంటుంటారు. ఎక్కువగా ప్రేమవివాహాలకు మొగ్గు చూపే వీరు తమ భాగస్వామికి ప్రత్యేక లక్షణాలు కలిగి వుండాలని కోరుకుంటారు. తమకు నచ్చిన విధంగా భాగస్వామి లేకపోతే ఆత్మనూన్యతకు గురౌతారు. తమ ఆలోచనలను భాగస్వామికి అర్థమయ్యేలా వివరించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే అలవాట్లను కలిగి వుంటారు.
మీన రాశి
వివాహం ద్వారా తమ జీవితంలోకి అడుగుపెట్టిన భాగస్వామి తమ ఆలోచనలకు తగినట్లుగా వుంటారో లేదోనన్న అనుమానాన్ని కలిగి వుంటారు. తమ ఆలోచనలకు తగినట్లుగా లేకపోతే కొత్త సంబంధాల్లో అడుగుపెట్టడానికి అడుగులు వేస్తుంటారు. తమ మనసును అర్థం చేసుకున్నవారిని జీవిత భాగస్వామిగా కలిగి వుండాలని అనుకుంటారు. భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. తమ భావాలను జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాలని అనుకుంటారు. తమ భావాలకు విలువ ఇవ్వని వారు దొరక్కపోతే అసౌకర్యానికి గురౌతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications