Latest Updates
-
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..
ఒకే రాశిలో మూడు గ్రహాలు.. ఈ 6 రాశుల వారు నక్కతోక తొక్కినట్లే, అదృష్టమే అదృష్టం!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు రోజురోజూకు మారుతుంటాయి. గ్రహాలు తమ తమ రాశులను మార్చుకోవడం, స్థానాలను మార్చుకోవడం వలన కొన్ని యోగాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ యోగాలు ప్రతి ఒక్క రాశి వారిపై అనేక మార్పులను తీసుకొస్తుంది. ఈ మార్పులు కొన్ని రాశుల వారికి గొప్ప ప్రయోజనాలను తీసుకొస్తే మరికొన్ని రాశుల వారికి కొన్ని విషాధ రోజులను తీసుకొస్తాయ. అయితే ఈనెల 27వ తేదీ వరకు కుంభ రాశిలో రవి, బుధ, శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇవి కొన్ని రాశుల వారికి శుభ ప్రయోజనాలను తీసుకొస్తుంది. ఆ రాశులు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారికి ఈ మూడు గ్రహాలు లాభకరమైన స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక లాభాలు ఎక్కువవుతాయి. షేర్లు, వ్యాపారాలు, పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సాధ్యం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు వస్తాయి.

వృషభ రాశి
ఈ మూడు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వలన, ఈ వృషభ రాశి వారికి ఉద్యోగ మార్పులు, ఉన్నత పదవులు లభించవచ్చు. వృత్తి, వ్యాపారాలు నూతన విజయాలకు చేరుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో పనిచేసే వారికి స్థిరత్వం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా కూడా అంతా అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి
ఈ రాశి వారికి గ్రహాల కలయిక వల్ల అనేక ధన లాభాలు ఏర్పడతాయి. విదేశీయానానికి అడ్డంకులు తొలగిపోతాయి. పిత్రార్జితాలు, ఆస్తి వివాదాల పరిష్కారం కూడా ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలో పరపతి కూడా పెరుగుతుంది. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. దీంతో పాటు అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే గొప్ప గొప్ప విజయాలను స్వాధీనం చేసుకోవచ్చు.
కన్య రాశి:
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో మంచి మార్పులు, ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది, నిరుద్యోగులు ఉద్యోగాల్లో చేరిపోతారు. ఉద్యోగులు తమ తమ ఉద్యోగంలో బాగా రాణిస్తారు. దీంతో పాటు వీరికి ఆరోగ్యం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
ధనుస్సు రాశి:
ఈ మూడు గ్రహాలు కుంభ రాశిలో మమేకం కావడం వలన ఈ రాశికి చెందిన వారికి అనేక లాభాలు చేకూరనున్నాయి. ఈ రాశి వారు చేపట్టబోయే ప్రతి పని సఫలమవుతుంది. ఈ మూడు గ్రహాల అనుకూలత కారణంగా వీరు చేపట్టబోయే ప్రయాణాలు, ఉద్యోగ మార్పులు లాభదాయకంగా ఉంటాయి. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి.
మకర రాశి
ఈ మూడు గ్రహాల కలయిక వలన లాభపడబోతున్న రాశుల్లో మకర రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వృత్తి, వ్యాపారాల్లో భారీగా లాభాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











