Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
నేటి రాశిఫలం 28 సెప్టెంబర్ 2024 : ప్రత్యర్తులు మీపై కుట్రపూనే అవకాశం జాగ్రత్తగా ఉండండి
Today Rashiphalalu 28 September 2024: నేటి రాశి ఫలాలు 28 సెప్టెంబర్ 2024, ఈ రోజు శనివారం, ఏకాదశి, ఆశ్లేష నక్షత్రం, రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆర్థికపరిస్థి, కుటుంబ , సంతోషం, కష్టాలు ఇలా ప్రతిదాని గురించి తెలుసుకోవచ్చు.
అలాగే, నక్షత్రాల సంచారం మరియు గ్రహాల కదలిక ఆధారంగా మీరు 12 రాశుల రాశిచక్రం యొక్క అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య మరియు అదృష్ట సమయాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు 28 సెప్టెంబర్ 2024 నాటి మీ జాతక ఫలితాలను ఇక్కడ తెలుసుకుందాం.

మేషరాశి
ఈ రోజు మేషరాశి వారికి గ్రహస్థానం అనుకూలంగా ఉంది. ఆర్థిక లాభాలు పొందుతారు. వ్యాపార పరంగా కలిసివస్తుంది, చక్కగా నిర్వహించగలుగుతారు. దీని ద్వారా భవిష్యత్తులో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భార్య భర్తల మధ్య చిన్న పాటి గొడవలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి
వృషభం
ఉద్యోగస్తులు ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. పనిలో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్తులు మీపై కుట్రపూనే అవకాశం ఉంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. అటువంటి సమయంలో మీ భావోద్యేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల నుండి ఎక్కువగా ఆశించడం కంటే మీమ్మల్ని మీరు నమ్ముకోండి.
మిధునరాశి
ఆర్థిక విషయాల్లో ఆందోళన చెందాల్సిన పనిలేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఓప్పందాలు, నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. భార్యభర్తల మధ్య అనుబంధం మధురంగా ఉంటుంది. పిల్లల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలి.
కర్కాటకం
ఉద్యోగస్తులకు మీరు చేసిన కృషికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు లాభదాయకమైన రోజు . మీ వ్యాపారంలో తండ్రి సహకారం మరియు మార్గదర్శకత్వం అవసరం అవుతుంది. మీ సమర్థతో విశ్వాసంగా పనిచేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండండి. కుటుంబవాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
సింహ రాశి
ఈ రోజు మీకు కొన్ని కొత్త భాద్యతలు పెరుగుతాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారంలో మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక విషయాల్లో మెరుగ్గా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు తెలివిగా ఎదుర్కోవాలి. మీరు మీ కుటుంబంతో సరదాగా మరియు ఆనందంగా గడుపుతారు.
కన్య రాశి
వ్యాపారంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందకు డబ్బును సమకూర్చుకోవాల్సి వస్తుంది. సోమరితనంతో వ్యాపారంలో ఇబ్బందులు కూడా ఉండవచ్చు. ఎంతో కొంత లాభాలు వచ్చినా కూడా నిరాశ చెందవద్దు. ఖర్చులతో పాటు ఆధాయ మార్గాలు పెరుగుతాయి. కాబట్టి సమస్య ఉండదు. మీరు చేసే ముఖ్యమైన పనికి అంతరాయం కలగవచ్చు. జాగ్రత్తగా ముందడుగు వేయండి.
తులారాశి
మార్కెటింగ్ మరియు మీడియా రంగంలో పనిచేసేవారికి శ్రద్ద అవసరం. ఇతరుపై ఆదారపడకుండా నిబంధనల ప్రకారం పనిచేయండి. వృత్తివ్యాపారంలో సరైన సామరస్యాన్ని కొనసాగిస్తారు. ఇంట్లో కఠినంగా వ్యవహరించడం వల్ల కుటుంబ సభ్యలుకు ఇబ్బంది ఉంటుంది. మీ అనుభవంతో కుటుంబంలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడంలో మీరు విజయం పొందుతారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది, పని ప్రదేశంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడికి గురి కాకుండా పనిచేయండి. తెలివిగా పనిచేస్తే మీరు విజయం సాధిస్తారు. అలా కొంతకాలంగా నిలిచిపోయిన పనులు తిరిగి ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబం వాతావరణం బాగుంటుంది. ఆస్థులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు శుభవార్తలు అందుకుంటారు. ఇంట బయటను ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధనం పొందుతారు. ఆర్థిక విషయాలలో సోదరి సోదరీమనులతో విభేదాలు ఉండవచ్చు. సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించుకోండి. మీ భాగస్వామి మద్దతు పూర్తిగా పొందుతారు. స్నేహితులు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు.
మకరరాశి
ఈ రోజు మీ చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తెలివిగా వ్యవహరించండి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. కానీ కొద్ది రోజులకు సర్ధుబాటు అవుతాయి. జీవిత భాగస్వామి కొరకు బహుమతులు కొంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కుంభ రాశి
మీకు వృత్తిపరమైన మార్పు ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆధ్యాత్మిక పరంగా బిజీగా ఉంటారు. సానుకూల వ్యక్తులతో మాట్లాడినప్పుడు మీ విశ్వాసం పెరుగుతుంది. ఏదైనా వ్యక్తిగత ఒత్తిడి కారణంగా, మీరు చేసే పనులపై దృష్టి పెట్టలేకపోవచ్చు. విద్యార్తులు ఉపాధ్యాయుల ఆశీర్వాదం పొందుతారు. కష్ట సమయాల్లో జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు మద్దతు పొందుతారు.
మీనరాశి
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది, వ్యాపారంలో ప్రస్తుత పరిస్థితులు ప్రభావితమవుతాయి. ప్రతి రంగంలో జీవిత భాగస్వామి సహకారం అందుతుంది. భార్యాభర్తల పరస్పర సహకారంతో ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. పెద్దల సహకారంతో న్యాయపరమైన పనుల్లో విజయం పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











