Latest Updates
-
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి!
ఎంత కష్టపడ్డా ఆర్థిక ఇబ్బందులు తప్పడంలేదా? ఇలా చేస్తే డబ్బే డబ్బు
ధనమూలం ఇదం జగత్ అని అంటారు. అన్నింటికీ డబ్బు కావాల్సిందే. ఏ సమస్యకైనా డబ్బు కావాల్సిందే. అలాగే డబ్బు లేకపోతే అన్ని సమస్యలూ చుట్టు ముడతాయి. అయితే కొందరు ఎంత కష్టపడ్డా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మరికొందరేమో చేతినిండా సంపాదిస్తున్నా చేతిలో రూపాయి మిగలకుండా పోతుంది. నెల తిరక్కముందే నెల జీతం కోసం వేచి చూడాల్సి వస్తుంది చాలా మందికి. కొందరికి ఎంత ప్రయత్నించినా వ్యాపారం సవ్యంగా సాగక ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలకు దారి తీస్తాయి. శారీరక, మానసిక, సామాజిక సమస్యలను తెచ్చిపెడతాయి. మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి, ఏం చెస్తే ఆర్థికంగా స్థిరంగా ఉండగలం, ఏం చేస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చనే విషయాల గురించి జ్యోతిష్య శాస్త్రం కొన్ని పరిహారాలు అందిస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శుభ్రం చేసి రాగి పాత్రతో నీళ్లు చల్లుకుని ముగ్గు పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. అలాంటి ఇంట్లోకి ప్రవేశించడానికి ఇష్టపడుతుంది.
- అలాగే ఉదయం ఇంటిని శుభ్రం చెయ్యకుండా అల్పాహారం చేయకూడదు. తెల్లవారుజామునే బయటకు వెళ్లాల్సి వచ్చినా సరే ఇంటిని చీపురుతో ఊడ్చుకోవాలి. ఉదయమే ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే ఊడ్చిన తర్వాతే తాళం వేసి వెళ్లాలి.
- బుధ వారాన్ని లక్ష్మీ ఆగమన దినంగా భావిస్తారు. అందుకే బుధవారం రోజున ఇంట్లో నుంచి డబ్బు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. అప్పు తీసుకున్నా బుధవారం రోజు చెల్లించవద్దు. బిల్లులు కూడా ఆరోజు కట్టవద్దు. ఏదైనా కొనాలనుకుంటే కూడా వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే బుధవారం రోజు అప్పు కూడా ఇవ్వొద్దు.
- గురువారం రోజు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధన లాభం జరిగితే అందులో కొంత భాగాన్ని దానం చేయాలి. వస్తు రూపంలో, ఆహార రూపంలో దానం చేయడం వల్ల లక్ష్మీ దేవి సంతోషిస్తుందట.
- తీసుకున్న అప్పును మంగళవారం రోజు చెల్లించండి. అదే రోజు బిల్లులు కట్టేందుకు కూడా ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది.
- ప్రతి శనివారం రోజు ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత చెత్తను ఇంటి బయట పడేయవద్దు. పనికి రాని వస్తువులైనా సరే శనివారం రోజు గేటు బయట పడేయకూడదు.
- అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ దేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి కరుణా కటాక్షాలను పాత్రులు కావొచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అమావాస్య రోజు మర్చిపోకుండా లక్ష్మీ దేవిని పూజించాలి.
- ఇంటి సింహ ద్వారాన్ని ద్వార లక్ష్మీగా భావిస్తారు. కనుక గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడేయకూడదు. గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావడం, గడపకు అటూ ఇటూ కాళ్లు పెట్టి నిలబడటం లాంటివి చెయ్యకూడదు. ఇది ద్వార లక్ష్మీని అవమాన పరచడం కిందే వస్తుంది. పసుపు కుంకుమలు ఉన్న గడపలు లక్ష్మీ దేవికి ఆహ్వానం పలుకుతాయని శాస్త్రం చెబుతోంది.
- చిల్లర నాణెలను, పువ్వులను, అన్నంకు నిర్లక్ష్యంగా పడేసే వారి ఇంట్లో ఉండటానికి లక్ష్మీ దేవి ఇష్టపడదు. అలాంటి వారికి లక్ష్మీ అనుగ్రహం కూడా లభించదు. కాబట్టి నాణెలు ఇంట్లో పడిపోయినా, పువ్వులు దారిలో ఉన్నా పక్కన పెట్టుకోవాలి. అంట్లు ఉంటే తీసేసి శుభ్రం చేసుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications