Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
Ugadi 2025 rashi phalalu: ధనస్సు రాశి వారికి ఈ ఏడాది పాపం..విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉంటుందో చూడండి
తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 30వ తేదీ నుంచి అంటే ఉగాది నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. విశ్వావసు నామ సంవత్సరం ధనుస్సు రాశి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో తెలుసుకోవాలని ఉందా? మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయా? ఆర్థికంగా ఎలా ఉంటుంది? ప్రేమ, కుటుంబ జీవితం ఎలా సాగుతుందనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఆదాయం,వ్యయం,రాజపూజ్యం, అవమానం
ధనస్సు రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 05గా ఉండగా..వ్యయం కూడా 05గా ఉంది. అంటే 5 రూపాయలు సంపాదిస్తే ఖర్చు కూడా 5 రూపాయలు ఉంటుంది.
రాజపూజ్యం 01గా ఉండగా..అవమానం 05గా ఉంది. అంటే 1 గౌరవమిచ్చేవాళ్లు ఉంటే 5గురు అవమానించేటోళ్లు ఉంటారు.

అన్ని విధాలుగా ఇలా
ఈ సంవత్సరం అంతా ధనస్సు రాశి వ్యక్తులకు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి.
-ఆరోగ్య కోణం నుంచి చూస్తే ఛాతీ, గుండె సంబంధిత సమస్య ఉన్న ధనస్సు రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఎప్పటికప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ ఆహారం మరియు జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
-పోటీ పరీక్షలకు హాజరయ్యే విధ్యార్థులందరికీ మంచి ప్రయోజనాలు ఉంటాయి.
-వ్యాపారం చేసే ధనస్సు రాశి వ్యక్తులకు అంత సులభం కాదు అన్నట్లుగా ఉంటుంది. కొంచెం గట్టిగా శ్రద్ద పెడితే వ్యాపారంలో ముందుకు సాగవచ్చు.
-ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం లేదా ఉద్యోగంలో మార్పు కోసం చూస్తున్నవారికి సమయం అనుకూలంగా ఉంది. కఠినమైన పరీక్షలు,ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
-ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు స్థిరమైన ఫలితాలను ఇస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, మీ బడ్జెట్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఆకస్మిక ధనలాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది.
-ప్రేమ జీవితం అంతా సీఫీగా సాగిపోతుంది. పెళ్లి చేసుకోడానికి ప్రయత్నిస్తున్నవారికి ఈ సంవత్సరంలో రెండో సగంలో అత్యుత్తమైన ఫలితాలు ఉంటాయి.
-గృహ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి.
-భూమి భవణ నిర్మాణ విషయంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కొద్దిగా బలహీనంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సంవత్సరం ద్వితీయార్థంలో కొంచెం అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
-ఈ సంవత్సరం మీ వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది.
జాగ్రత్తలు
ఈ సంవత్సరం మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
