Latest Updates
-
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇల్లు కట్టేటప్పుడు ప్రధాన ద్వారం నిర్మాణం చాలా ప్రత్యేకంగా, వాస్తు ప్రకారం నిర్మిస్తారు. ఈ ద్వారం కేవలం ఇంట్లోకి రావడం, బయటకు వెళ్లడం మాత్రమే కాదు.. ఇక్కడి నుంచే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక, సూర్యాస్తమయంలో ప్రధాన ద్వారానికి సంబంధించి కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఆ నియమాలేంటి.. ఇక్కడ చూద్దాం..

సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారాన్ని ఎక్కువసేపు మూసి ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీని ద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం.. కొన్ని పూజలు, మతపరమైన కార్యకలాపాలకు సాయంత్రం సమయం ప్రత్యేకమైనది. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. అందుకే రోజూ రెండు పూటలా ఇంటి ప్రవేశద్వారాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు కొంతసేపు తెరిచి ఉంచాలని వాస్తు చెబుతోంది.
గాలి, వెలుతురు
సంధ్యావేళల్లో ఇంటి ప్రధాన ద్వారం ఎక్కువసేపు మూసి ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో పాటు ఆర్థిక సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో వాతావరణం చల్లబడటంతో స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఈ సమయంలో కిటికీలను, ప్రధాన ద్వారాన్ని కొద్దిసేపు తెరిచి ఉంచడం మంచిది. అంతేకాకుండా సాయంత్రం వేళల్లో దీపం వెలిగించడం కూడా ఇంటికి శుభప్రదం.
సరైన లైటింగ్

మన పూర్వీకుల కాలం నుంచి సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించే సంప్రదాయం కొనసాగుతుంది. దీపం వెలిగించడం ద్వారా ఇంటి నుంచి చీకటి, ప్రతికూలత తొలగిపోతుంది. అంతేకాకుండా ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి దీపాలు వెలిగించడం చిహ్నం. ఇంకా ప్రధాన ద్వారం చుట్టూ శుభ్రమైన నీటిని లేదా గంగాజల్లాన్ని చల్లుకోవడం ద్వారా పాజిటివల్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఈ సూచనలు పాటించండి..
రోజూ రెండు పూటలా ఇంటి ప్రవేశద్వారం ఎల్లప్పుడూ శభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చెత్తాచెదారాన్ని తొలగించుకోవాలి. బూట్లు, చెప్పులతో పాటు అనవసరమైన వాటిని ఉంచకండి. మెయిన్ డోర్ వద్ద సాయంత్రం సమయంలో వెలుతురు ఉండేలా లైట్ లేదా దీపం పెట్టుకోవాలి. తగినంత లైటింగ్ ఉండటంతో పాటు శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంటే మెయిన్ డోర్ నుంచి ఇంటిలోపలికి సానుకూల వాతావరణ, శ్రేయస్సుతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
