Latest Updates
-
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా? -
చేపల వేపుడును మించిపోయే రుచితో కందగడ్డ ఫ్రై.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండి ఇలా! -
ఒకే రకమైన ఎగ్ కర్రీ తిని విసిగిపోయారా? ఒక్కసారి ఈ నేపాల్ స్టైల్ ఎగ్ రెసిపి తింటే జన్మలో మర్చిపోరు! -
షుగర్ వ్యాధి వచ్చే ముందు కనబడే సంకేతాలు ఇవే! -
బిర్యానీకి మించిన రుచి..తక్కువ మసాలాలతో పిల్లలు,పెద్దలు మెచ్చే మొరాదాబాదీ చికెన్ పులావ్ ఇలా వండండి! -
India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? -
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో ఈ సాంబార్ చేసుకుంటే..జలుబు, తలనొప్పి అన్నీ పరార్! -
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి.. -
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి..
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి?
మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ గ్రామానికైనా, ఏ ఊరుకైనా వెళ్లాలంటే ఎవరి పర్మీషన్ అవసరం లేదని మనందం అనుకుంటాం. కానీ మనదేశంలో ఉన్న ఒక్క ఊరికి మాత్రం మనదేశస్థులు వెళ్లాలంటే ప్రభుత్వ ప్రత్యేక అనుమతి ఉండాలి..లేకుంటే గ్రామంలో అడుగుపెట్టనివ్వరు. ఆ గ్రామం ఎక్కడుంది, మనదేశంలో ఉండి భారతీయులు వెళ్లడానికి వీల్లేని ఆ గ్రామ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
2015లో జరిగిన చారిత్రాత్మక భారత్-బంగ్లాదేశ్ భూ సరిహద్దు ఒప్పందంలో భాగంగా భారత ప్రభుత్వం దాదాపు 111 చిన్న ప్రాంతాలను బంగ్లాదేశ్ కు అప్పగించింది. అయితే ఆ భూ బదిలీ సమయంలో ఒక ముఖ్యమైన ప్రాంతాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగానే అలాగే వదిలివేశారు. అదే దహాగ్రామ్-అంగర్ పోటా.

భారత గడ్డపై బంగ్లాదేశ్ గ్రామం
పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహార్ జిల్లా సరిహద్దుల్లో నాలుగు వైపులా భారత భూభాగంతో చుట్టుముట్టబడి ఉన్న ఈ చిన్న ప్రాంతం అక్షరాలా బంగ్లాదేశ్ లో ఒక భాగం. చుట్టూ భారతదేశమే ఉన్నా ఈ గ్రామంలో మాత్రం బంగ్లాదేశ్ చట్టాలే అమలవుతాయి. సుమారు 18.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్రామంలో 20000 మందికి పైగా బంగ్లాదేశ్ పౌరులు నివసిస్తున్నారు. మన దేశ భూభాగం మధ్యలో ఉన్నప్పటికీ, భారతీయుల ప్రవేశంపై కఠినమైన నియంత్రణలు ఉండటం ఈ ప్రాంతాన్ని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలుపుతుంది.
కరెన్సీ నుండి నెట్ వర్క్ వరకు అన్నీ బంగ్లాదేశ్
భారతదేశం మధ్యలో ఉన్నప్పటికీ, ఈ గ్రామస్థుల దైనందిన జీవితం, భాష, సంస్కృతి పూర్తిగా బంగ్లాదేశ్ తోనే ముడిపడి ఉంటాయి. ఇక్కడ భారత రూపాయి చెల్లదు. ప్రజలు బంగ్లాదేశ్ కరెన్సీనే ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ గ్రామానికి అవసరమైన స్కూల్స్, హాస్పిటల్స్, ఇతర ప్రభుత్వ సేవలను బంగ్లాదేశ్ ప్రభుత్వమే నేరుగా అందిస్తుంది. ఫోన్ మాట్లాడటానికి కూడా వారు బంగ్లాదేశ్ మొబైల్ నెట్ వర్క్ సేవలనే వాడతారు. అంటే మన దేశ సరిహద్దుల్లో ఉంటూనే అక్కడ ఒక మినీ బంగ్లాదేశ్ వాతావరణాన్ని స్పష్టంగా చూడవచ్చు.

బహిరంగ జైలు లాంటి గతం
1992కి ముందు ఈ గ్రామస్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. తమ సొంత దేశమైన బంగ్లాదేశ్ ప్రధాన భూభాగం కేవలం 178 మీటర్ల దూరంలోనే ఉన్నా, అక్కడికి చేరుకోవడానికి నేరుగా రహదారి ఉండేది కాదు. గ్రామంలోకి రావాలన్నా, బయటకు వెళ్లాలన్నా భారత ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. కనీస సౌకర్యాలు లేక, బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయి తాము ఒక బహిరంగ జైలులో బందీలమయ్యామని వారు భావించేవారు. ఈ కష్టాలకు ముగింపు పలికేందుకు 1974లో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 178 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పు గల టిన్ బిఘా కారిడార్ అనే భూభాగాన్ని బంగ్లాదేశ్ కు లీజుకు ఇవ్వడానికి భారత్ అంగీకరించింది.
ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన ఈ కారిడార్, దహాగ్రామ్-అంగర్‌పోటాను బంగ్లాదేశ్ ప్రధాన భూభాగంతో నేరుగా అనుసంధానించింది. అయితే తొలినాళ్లలో ఈ కారిడార్ గేట్లు రోజుకు కేవలం 12 గంటలు మాత్రమే తెరిచి ఉండేవి. సమయానికి గేటు దాటలేకపోతే మరుసటి రోజు వరకు అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఎట్టకేలకు 2011లో భారత ప్రభుత్వం ఈ కారిడార్ ను రోజంతా అంటే 24 గంటలూ తెరిచి ఉంచేందుకు అనుమతించడంతో దహాగ్రామ్-అంగర్ పోటా గ్రామస్థుల దశాబ్దాల కష్టాలకు తెరపడి నిజమైన స్వేచ్ఛ లభించింది.
సందర్శకులకు ప్రవేశ నియమాలు ఏమిటి?
అంతర్జాతీయ సరిహద్దు భద్రతా కారణాల దృష్ట్యా ఈ గ్రామంలోకి సాధారణ భారతీయులకు కానీ, ఇతర దేశాల పర్యాటకులకు కానీ నేరుగా ప్రవేశం ఉండదు. ఎవరైనా ఈ వింత గ్రామాన్ని సందర్శించాలనుకుంటే, ముందుగా ప్రభుత్వ ప్రత్యేక అనుమతి లేదా సరైన పాస్ పోర్ట్, పత్రాల ధృవీకరణ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications
