Latest Updates
-
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.!
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
మన ఇంటి ప్రధాన ద్వారం కేవలం రాకపోకలకు ఉపయోగించే మార్గం మాత్రమే కాదు, వాస్తు శాస్త్రం ప్రకారం అదొక అతిపెద్ద శక్తి కేంద్రం. ఇంట్లోకి మంచి జరిగినా, చెడు జరిగినా అది ఈ ద్వారం గుండానే ప్రవేశిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే గడపకు పసుపు, కుంకుమలు రాసి, దేవుడి పటాలతో అందంగా అలంకరిస్తుంటారు.
అయితే ఏ దేవుడి ఫొటో పడితే ఆ దేవుడి ఫొటో గుమ్మంపై పెట్టకూడదని మీకు తెలుసా? వాస్తు నియమాల ప్రకారం ప్రధాన ద్వారం దగ్గర ఎలాంటి ఫొటోలు ఉంచాలో, ఎలాంటివి ఉంచకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

విఘ్నాలను తొలిగించే స్వామి
ఇంటి గుమ్మంపై సాక్షాత్తూ ఆ విఘ్నేశ్వరుడి ప్రతిమను లేదా పటాన్ని ఉంచడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. విఘ్నహర్త అయిన గణపతిని ద్వారం దగ్గర ఉంచడం వల్ల ఇంట్లోకి సుఖసంతోషాలు, ప్రశాంతత వెల్లువెత్తుతాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన వాస్తు నియమం పాటించాలి. గణనాథుడు ఎల్లప్పుడూ కూర్చున్న భంగిమలో ఉన్న చిత్రాన్ని మాత్రమే ఎంచుకోవాలి. అలాగే స్వామివారి ముఖం బయటి వైపు చూస్తున్నట్లుగా ఉండాలి, వారి వీపు భాగం ఇంటి లోపలి వైపుకి ఉండకూడదు.
సిరిసంపదల కోసం లక్ష్మీదేవి, కుబేరుడు
మీ ఇంట సిరిసంపదలు ఎల్లప్పుడూ నిలిచి ఉండాలంటే ప్రధాన ద్వారం దగ్గర ధనలక్ష్మి, కుబేరుల పటాలను ఉంచవచ్చు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అయితే లక్ష్మీదేవి పటాన్ని కొనేటప్పుడు ఆమె పద్మంపై కూర్చుని ఉన్న ఫొటోని మాత్రమే ఎంచుకోవాలి. నిలబడి ఉన్నట్లుగా ఉండే లక్ష్మీదేవి పటాన్ని పెడితే, ఇంట్లో డబ్బు నిలకడగా ఉండదని వాస్తు పండితులు చెబుతున్నారు.

శుభ సంకేతాలు.. సానుకూల శక్తులు
దేవుని పటాలతో పాటు మహాలక్ష్మి పాదముద్రలను గుమ్మం దగ్గర ఉంచడం మహాభాగ్యంగా పరిగణిస్తారు. ఇది ఇంటికి అష్టైశ్వర్యాలను తీసుకువస్తుంది. అలాగే, తలుపుకు ఇరువైపులా కుంకుమతో స్వస్తిక్ లేదా శుభ్-లాభ్ అని రాయడం వల్ల ఇల్లు నరదిష్టి బారిన పడకుండా ఉంటుంది. ఈ పవిత్రమైన గుర్తులు ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల వాతావరణాన్ని నింపుతాయి.
పొరపాటున కూడా ఈ చిత్రాలు పెట్టకండి
వాస్తు శాస్త్రం ప్రకారం.. దేవుళ్ళు లేదా దేవతల ఉగ్ర రూపాలు, కోపంగా ఉన్న చిత్రాలను సింహద్వారంపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. ఉగ్ర రూపంలో ఉన్న శివుడు, శని భగవానుడు లేదా కాళికామాత పటాలను పెట్టకూడదు. ఇలాంటి చిత్రాలు ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షించి, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలకు దారితీస్తాయి. ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఆశీర్వదిస్తున్నట్లుగా ఉండే ప్రశాంతమైన చిత్రాలనే ఎంచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
