Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్‌లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం కురిపించనున్న శుక్రుడు.. వీరి జీవితం ఫైవ్ స్టార్‌గా మారబోతుంది!
నక్షత్రాల పరివర్తనం, గ్రహాల గమనం అనేది ప్రతి రాశి యొక్క ఫలాలను నిర్ణయిస్తాయి. ఈ గ్రహాల గమనాలు ప్రతి రాశిలో వేరు వేరు ఫలితాలను ఇస్తాయి. అయితే ఎప్పుడూ శుభపరిణామాలనే ఇచ్చే శుక్రుడు ప్రస్తుతం మకర రాశిలో సంచరిస్తున్నారు. దీని కారణంగా మూడు రాశుల వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఆనందంగా జీవించాలన్నా, అనుకున్న స్థాయిలో సంపాదించాలన్నా, కోరుకున్నవి నెరవేరాలన్నా కచ్చితంగా శుక్రుడి అనుగ్రహం ఉండాలి. ఆ శుక్రుడి అనుగ్రహం ఈ మూడు రాశులపై ఉంది. ఆ రాశులు ఏంటి వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వృషభ రాశి
శుక్రుడి సంచారంలో మార్పు కారణంగా ఈ రాశివారికి అదృష్టం వరించనుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు వెళ్తారు. వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు. పని ప్రదేశంలో అద్భుతంగా రాణించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. నిరుద్యోగులకు భారీ జీతంతో ఉద్యోగాలు దొరుకుతాయి. ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయి. దంపతుల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్ధిక వనరులను పెంచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉంటుంది.
మేష రాశి
శుక్రుడి సంచారంలో మార్పుల కారణంగా మేష రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగంలో భారీగా లాభాలను పొందుతారు. తమ ఉద్యోగంలో మంచి ప్రతిభను కనబరిచి ఉన్నతాధికారులు మెప్పు పొందుతారు. అలాగే వీరికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద, కొత్త ప్రాజెక్టును చేపట్టే ఛాన్స్ ఉంది.
ఈ రాశి వారికి శుక్రుడి సంచారం కారణంగా ఆకస్మిక ధనలాభం చేకూరనుంది. కోర్టుకు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వెలువడతాయి. అలాగే 2025 నాటికి ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆ వ్యాపారంలో వీరికి మంచి ఆర్ధిక లాభం కలుగుతుంది. కుటుంబ వాతావరణం అమోఘంగా ఉంటుంది. ఒడిడుకులను ఎదుర్కొని జీవితంలో నిలదొక్కుకుంటారు.
మిధున రాశి
ఈ రాశి వారు కూడా శుక్రుడి సంచారం వలన అనేక మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏ పని చేపట్టినా అది వారికి సమాజంలో మంచి గుర్తింపును తీసుకొస్తుంది. ఆర్ధిక మార్గాలు పెరుగుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. అనేక రంగాల నుంచి వీరికి పెట్టుబడులు, ఆదాయం వచ్చి చేరుతుంది. అలాగే ఈ రాశికి చెందిన వారికి వచ్చిన డబ్బులో సగం ఇతరులకు ఇచ్చేస్తుంటారు. దీనివల్ల రాజకీయ లబ్ధికూడా పొందనున్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications