రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్‌ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని ప్రేమ, అందం, సంపద, శ్రేయస్సుకి, భౌతిక సంతోషాలకు అధిపతిగా పరిగణిస్తారు. ఈ గ్రహ ప్రభావం ఉంటే జీవితంలో అన్ని సంతోషాలు ఉన్నట్లే ఈ క్రమంలో శుక్ర గ్రహం నక్షత్ర మార్పులు వివిధ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుండగా.. మరికొన్ని రాశుల వారికి సమస్యలను ఇస్తుంది. ప్రస్తుతం ఈ గ్రహం.. రాహువు సొంత రాశి అయిన స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్‌ 24 వరకు అక్కడే సంచరిస్తున్న నేపథ్యంలో మూడు రాశుల వారిని అదృష్టం వరించనుంది. అది ఎలానో చూద్దాం..

Venus transits into Swati Nakshatra good days for these three zodiac signs until October 24

కన్నా రాశి

రాహు నక్షత్రంలోకి శుక్ర సంచారం కన్యా రాశి వారికి ఎనలేని ప్రయోజనాలు, అదృష్టాన్ని ఇవ్వనుంది. ప్రేమించిన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ప్రేమ మరింత బలపడి వారితో సంపూర్ణమైన జీవితం ఆస్వాదిస్తారు. కుటుంబీకుల సపోర్ట్‌తో పలు సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. దీంతో వారి వ్యక్తిత్వం మరింత వికసిస్తుంది.

భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్‌.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.!భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్‌.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.!

తులారాశి

స్వాతి నక్షత్రంలోకి శుక్ర గోచారం తులారాశి వారికి మంచి రోజులు తీసుకురానున్నాయి. వృత్తి, ఆర్థిక పరమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. మీ ఎదుగుదలకి కొత్త అవకాశాలు వస్తాయి. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు. ఆర్థికంగా బాగుంటారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంటుండటంతో సమాజంలో మీ మాటలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది.

Venus transits into Swati Nakshatra good days for these three zodiac signs until October 24

కుంభరాశి

చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.!చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.!

కుంభరాశి వారికి అక్టోబర్‌ 24 వరకు సంపూర్ణ జీవితం ఆస్వాదిస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు అందుకుంటారు. వ్యాపారస్తులు ఒక ప్రాజెక్టుతో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కొత్త అవకాశాలు వస్తాయి. దీంతో సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. ప్రేమించిన వారితో జీవితం బాగుంటుంది. కుటుంబీకుల మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ చదువులో భాగంగా కోరుకున్న కాలేజీలో సీటు పొందుతారు. ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీ అభ్యున్నతికి దోహదపడుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Saturday, September 26, 2026, 6:35 [IST]
Desktop Bottom Promotion