Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఇంట్లోకి గబ్బిలం వస్తే ఏమి జరుగుతుంది..? నల్ల చీమలు ఎక్కువగా వుంటే దేనికి సంకేతం..?
పెద్దల మాట చద్దన్న మూట అని అంటారు. పెద్దల మాట వింటే అంతా మంచే జరుగుతుందని అంటారు. వేల యేళ్ల నుంచి హిందూ సంస్కృతిలో కొన్ని నమ్మకాలను ఇప్పటికీ ఫాలో అవుతూనే వున్నారు. బల్లి మీద పడితే ఏమవుతుంది, కాకి ఇంటి ముంద వచ్చి అరిస్తే ఏమవుతుంది. లాంటి విషయాలు కొన్నింటిని సూచిస్తున్నట్టు మనకు మన పండితులు, పెద్దలు ఎన్నో యేళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఇంట్లోకి కొన్ని జంతువులు, పక్షలు వస్తే ఏం జరుగుతుందో మీకు ఈ ఆర్టికల్‌లో తెలియజేయబోతున్నాం. కొన్ని సందర్భాల్లో కొందరి ఇళ్లల్లోకి కాకి వస్తుంది, గబ్బిలం వస్తుంది. అలాంటి సంకేతాలను ఏ విధంగా అర్ధం చేసుకోవాలో మనకు తెలియదు. వీటికి కూడా శాస్త్రం సమాధానం చెప్పింటి. ఆవేంటో తెలుసుకుందాం.
ఇళ్లు దేవాలయం లాంటిదని పెద్దలు చెబుతున్నారు. ఇళ్లు శుభ్రంగా లేకపోతే ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే వుంటాయని శాస్త్రం చెబుతోంది. కాకి వస్తే అది అశుభంగా భావించాలని అంటున్నారు. కాకి ఇంట్లోకి ప్రవేశించవద్దని చెబుతున్నారు. కాకి దరిద్రానికి సూచిక అని చెబుతున్నారు. శనీశ్వరుడికి వాహనం కాకి. దరిద్ర దేవతకు వాహనం కూడా కాకే. కాకి ఇంట్లోకి ప్రేవేశించగానే ఒక చెడువార్తను వింటారని శాస్త్రం చెబుతోంది.

గబ్బిలం కూడా ఇంట్లోకి ప్రవేశించకూడదని చెబుతున్నారు. గబ్బిలం అశుభానికి సూచిక. కాకి, గబ్బిలం, గుడ్లగూబ ఇంట్లోకి ప్రవేశించగానే ఎక్కువగా భయపడకుండా ఇంట్లోనే దీనికి పరిహారం చేసుకోవచ్చని ప్రముఖ జ్యోతిష్య పండితులు సలహా ఇస్తున్నారు.
కాకి, గబ్బిలం వస్తే దోషాన్ని ఎలా తొలగించుకోవాలి ?
ఇంట్లోకి గబ్బిలం, కాకి ప్రవేశిస్తే తరువాత రోజు ఇంట్లో వాళ్లందరూ లేచి స్నానపు నీళ్ల్లో కొంచెం గోమూత్రము, తులసి చెట్టు కింద వున్న చిటికెడ మట్టిని కూడా వేసుకొని తల స్నానం చేసుకోవాలని చెబుతున్నారు. తరువాత ఇళ్లూ వాకిలిని గోమూత్రము, పచ్చ కర్పూరము, పసుపుతో కలిపిన నీళ్లతో ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలని సూచిస్తు్నారు. ఇంటి హాల్ మధ్యలో బియ్యపు పిండితో ముగ్గు వేయాలంటున్నారు. నక్షత్రం ఆకారంలో ముగ్గు వేసి దానిపై విస్తరాకును పెట్టాలి. ఆ విస్తరాకుపై సముద్రంలో దొరికే కల్లుప్పును వేయాలి. ఆ ఉప్పు మీద మట్టి ప్రమిదను పెట్టి మూడు వత్తులు పెట్టి, ఆముదము పోసి దీపాన్ని వెలిగించాలి. దీపం కొండెక్కే వరకు అలాగే వుంచాలి. తరువాత ఇస్తరాకును, దీపం, ఉప్పును తీసుకొని వెళ్లి ఎవ్వరూ తొక్కలేని ప్రదేశంలో వదిలివేయాలి.
ఇక ఇంట్లో వున్న వాళ్లందరూ ఇంటి దైవానికి సంబంధించిన దేవాలయానికి వెళ్లి అభిషేకం చేసుకోవాలి. దేవుడిని కడిగిన నీళ్లను ఇంటికి తీసుకొని వచ్చి. ఆ నీళ్లను తులసి ఆకుతో అందరిపై చల్లుకొని ఇంట్లో కూడా చల్లాలి. సాంబ్రానితో ఇంట్లో పొగ వేస్తే, ఇంటికి పట్టిన దోషం మొత్తం తొలగిపోతుంది. ఇక ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ప్రవేశించదు.
ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా కనిపిస్తే లక్ష్మీదేవికి సంకేతం. త్వరలోనే ఇంట్లో వారు అర్ధికంగా మెరుగుపడ్డం జరుగుతుంది. ఇక ఎర్ర చీమలు కనిపిస్తే ధనం కరిగిపోతుందని సంకేతమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications