Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
మీ రాశిని బట్టి ఈ లక్కీ స్టోన్‌ను ధరించండి.. ఇక వెనక్కి తిరిగి చూడనవసరం లేదు..!
కెంపు రత్నమనేది సూర్యునికి సంబంధించిన రత్నం. ఆరోగ్యం, ఉద్యోగం, అధికారం, హృదయ రోగాల నుంచి విముక్తికి ఈ కెంపు రత్నాలను ధరించవచ్చని శాస్త్రం చెబుతుంది. 1, 10, 19, 28, తేదీల్లో ధరించవచ్చు. దీన్ని బంగారు ఉంగరంతో చేయించి ఆదివారం నాడు కుడిచేతి ఉంగరపు వేలికి ధరించాలి. రాజకీయాల్లో ఉన్నత స్థితికి కూడా ఈ కెంపు రత్నం ఉపయోగపడుతుంది.

పచ్చ రత్నం
పచ్చ రత్నం బుధునికి సంబంధించినది. ఉద్యోగం, వాపారం, మెదడు, నరాలకు సంబంధించిన వ్యాధులకు రక్తపోటు నుంచి విముక్తికి పచ్చ రత్నాన్ని ధరించివచ్చని శాస్త్రం చెబుతోంది. అలాగే ఈ పచ్చ రత్నాన్ని మిధునం, ఆశ్లేష, జ్యేష్ట, రేవతీ నక్షత్రంలో జన్మించిన వారు ధరించవచ్చు. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు పచ్చ రత్నాన్ని ధరించవచ్చు. బుధ మహాదశ జరుగుతున్న వారు కూడా ఈ పచ్చ రత్నాన్ని ధరించవచ్చు. ఈ పచ్చ రత్నాన్ని వెండితో ఉంగరం చేయించి చిటికెన వేలికి ధరించాలి.
పుష్యరాగ రత్నం
పుష్యరాగ రత్నం గురుగ్రహానికి సంబంధించిన రత్నం. ఆర్థికాభివృద్ధి, ఉన్నత కీర్తి, సంతాన ప్రాప్తికి ీ పుష్యరాగ రత్నాన్ని ధరించివచ్చని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ పుష్యరాగ రత్నాన్ని ధనుస్సు రాశి వారు, మీన రాశి వారు, పూర్వ పద నక్షత్రాల వారు ధరించవచ్చు. 3, 12, 21, తేదీల్లో జన్మించిన వారు ఈ పూష్యరాగాన్ని ధరించవచ్చు. అలాగే జ్యోతిష్యంలో గురుడు నీచ స్థితిలో మకర రాశిలో వున్నప్పుడు దుర్భల రాశుల్లో వున్నవారు ఈ పుష్యరాగాన్ని ధరించవచ్చు. ఈ రత్నాన్ని బంగారంతో ఉంగరం చేయించి. గురువారం చూపుడు వేలుకు ధరించాలి.

గోమేధికం
గోమేధిక రత్నం రాహువుకు సంబంధించిన రత్నం. రుణ బాధలు, రోగ బాధల విముక్తికి ఈ గోమేధిక రత్నాన్ని ధరించవచ్చని శాస్త్రం చెబుతోంది. అలాగే ఈ గోమేధికాన్ని ఆరుద్ర, స్వాతి, శతభిషా నక్షత్రంలో జన్మించిన వారు ధరించవచ్చు. 4, 13, 22, 31లో జన్మించిన వారు ఈ గోమేధికాన్ని ధరించవచ్చు. జాతకచక్రంలో రాహువు నీచ స్థితిలో వున్న వారుకూడా ఈ గొమేధికాన్ని ధరించవచ్చు. ఈ గోమేధికాన్ని సత్‌లోహంతో ఉంగరం చేయించి సోమవారం లేదా శనివారం ఎడమచేతి మద్య వేలికి ధరించాలి.
వజ్ర రత్నం
వజ్ర రత్నం శుక్రునికి సంబంధించిన రత్నం. ఇది చాలా ఖరీదైన రత్నం. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యాభివృద్ధికి ఈ రత్నాన్ని ధరించవచ్చునని శాస్త్రం చెబుతోంది. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు ఈ రత్నాన్ని ధరించివచ్చు. జాతకచక్రంలో శుక్రుడు నీచస్థితిలో వున్నప్పుడు ఈ వజ్రాన్ని ధరించవచ్చు. బంగారంతో ఉంగరం చయించి శుక్రవారం కుడి చేతి చూపుడువేలుకి ధరించాలి.
ముత్యం
ముత్యం చంద్రునికి సంబంధించిన రత్నం. శ్వాస కోష సంబంధించిన వ్యాధులు తగ్గడానికి ఈ ముత్యం రత్నాన్ని ఉపయోగించవచ్చని శాస్త్రం చెబుతోంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో జన్మించిన వారు ధరించవచ్చు. 2, 11, 29 తేదీల్లో జన్మించిన వారు కూడా ఈ ముత్యం రత్నాన్ని ధరించవచ్చు. వివాహం సకాలంలో జరిగేందుకు కూడా దీన్ని ధరిస్తారు. ఈ ముత్యాన్ని వెండితో ఉంగరం చేయించి సోమవారం కుడిచేతి చూపుడు వేలుకి ధరించాలి.
పగడము
పగడము కుజునికి సంబంధించిన రత్నం. రుణ భారం, కుజ దోశ విముక్తికి ఈ పగడాన్ని ధరించవచ్చని శాస్త్రం మనకు చెబుతుంది. మేషం, వృశ్చిక రాశుల్లో జన్మించిన వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు ధరిస్తే మంచి ఫలితాలు వుంటాయ్. భూవివాదాలను పరిష్కరించుకునేందుకు కూడా ఈ పగడాన్ని ధరించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
